Skip to main content

Posts

Showing posts from May, 2022

సృజనాత్మకతను వెలికితీసేందుకు లఘు చిత్రాలు దోహదపడతాయి

సృజనాత్మకతను వెలికితీసేందుకు లఘు చిత్రాలు దోహదపడతాయి . - దర్శకుడు రత్నాకర్ కనపర్తి తెనాలి: సృజనాత్మక కళలను వెలికితీసేందుకు లఘుచిత్రాలు దోహదపడతాయని దర్శకుడు రత్నాకర్ కనపర్తి అన్నారు. స్థానిక మారీసుపేటలోని తెనాలికింగ్స్ స్టూడియోలో  ఏ. జీ. వి. ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత బి. వెంకటేశ్వరరావు నిర్మించి, వెంకీ (బ్లాక్ బాయ్) దర్శకత్వంలో  వేర్ ఈజ్ శైలజ అనే లఘు చిత్రాన్ని యు ట్యూబ్ ద్వారా విడుదల చేసారు. చిత్ర విడుదల కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రత్నాకర్ మాట్లాడుతూ చిత్ర దర్శకుడు వెంకీ పలు చిత్రాలలో నటించాడని, దర్శకునిగా పలు లఘుచిత్రాల ను రూపొందించాడు అని చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రాలు రూపొందించి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. యువదర్శకులను ప్రోత్సహిస్తున్న వెంకటేశ్వర రావు ను అభినందించారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ గతంలో తాను రూపొందించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.  నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతన కళాకారులను తమ సంస్థ ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో..

VIGNAN UNIVERSITY - APPLICATIONS ARE INVITED FOR THE ABOVE POSTS

ఖోఖో పోటీల్లో విజ్ఞాన్స్‌ వర్సిటీకు రెండు స్వర్ణాలు

ఖోఖో పోటీల్లో విజ్ఞాన్స్‌ వర్సిటీకు రెండు స్వర్ణాలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన ఖోఖో టీం విద్యార్థులు రెండు స్వర్ణ పతకాలు సాధించారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణాలు సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీలో అభినందన సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల జాతీయస్థాయిలో నిర్వహించిన ‘‘ఫోనిక్స్‌–2022’’లోని ఖోఖో పోటీల్లో స్వర్ణపతకం సాధించారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తమ యూనివర్సిటీ జట్టు హోరాహోరీగా తలపడి 6 పాయింట్ల లీడ్‌తో విజయం సాధించారని పేర్కొన్నారు. అదే విధంగా హైదరాబాద్‌లోని మహీంద్ర యూనివర్సిటీ నిర్వహించిన ‘‘ఎయిరో: ఇంటర్‌ కాలేజ్‌ స్పోర్ట్స్‌ ఫెస్ట్‌’’లో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా స్వర్ణ పతకం సాధించారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ పీసీ కళాశాలతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 10 పాయింట్ల లీడ్‌తో ఏకపక్ష విజయం సాధించారని తెలియజేసారు. స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్...

మతసామరస్యాన్ని కాపాడే రచనలను ప్రోత్సహించాలి

మతసామరస్యాన్ని కాపాడే రచనలను ప్రోత్సహించాలి   - దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్      ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి  - ఘనంగా సాక్షాత్కారము పుస్తక ఆవిష్కరణ సభ  -పేదలకు నూతన వస్త్రాల పంపిణి  తెనాలి: మత సామరస్యాన్ని కాపాడే రచనల అవసరత ఎంతైనా ఉందని, అలాంటి రచనలు చేస్తున్న రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దళిత సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు.  కొత్తపేట లోని పెన్షనర్స్ హాల్ లో ఆదివారం రాత్రి పట్టణానికి చెందిన రచయిత కనపర్తి డేవిడ్ రచించిన సాక్షాత్కారము పుస్తక ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. సభకు డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ అధ్యక్షత వహించారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని సాక్షాత్కారము పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య కృపాచారి మాట్లాడుతూ కనపర్తి కలం పేరుతో రచనలు చేస్తున్న రచయిత డేవిడ్ మత గ్రంథాల్లోన్ని సారాంశాలను సులువైనరీతిలో సామాన్యులకు అర్థమయ్యేలా రచనలు చేస్తున్నారని ప్రశంసించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు, సహజకవి అయినాల మల్లేశ్వరరావు సాక్...

జీపాట్‌–2022లో విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థుల సత్తా

జీపాట్‌–2002లో విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థుల సత్తా న్యూఢిల్లీలోని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన జీపాట్‌(గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)–2022లో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు సత్తాచాటారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసబాబు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. జీపాట్‌–2022లో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులలో జీ.ఔచిత్య(845), ఎన్‌.సుధాకర్‌ రెడ్డి (1509), ఆర్‌.సాయి కిరణ్‌ నాయక్‌ (2085), ఎన్‌.మేఘన(2183), వి.అంక రాజేశ్వరిæ(3133),  ఎస్‌.శ్రీవల్లి (3343), ఎం.జాహ్నవి (3574), బీ.నాసరయ్య (4201), ఈ.దుర్గా గాయత్రి (4678), బీ.సన్నీ (9950)లు ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణత పొందిన ప్రతి విద్యార్థికి నెలకు రూ. 12,500 వేతనాన్ని ఏఐసీటీఈ చెల్లిస్తుందని తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ప్రిన్సిపల్‌ డాక్టర్...

తల్లిదండ్రుల త్యాగఫలం ఎనలేనిది

తల్లిదండ్రుల త్యాగఫలం ఎనలేనిది   టీసీఎస్‌ టాలెంట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డెలివరీ హెడ్‌ శ్రీనివాస రామానుజం కండూరి   విజ్ఞాన్స్‌ నిరులాలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు ఎనలేనివని టీసీఎస్‌లోని ఏడబ్యూఎస్‌ క్లౌడ్‌ బిజినెస్‌ యూనిట్‌ టాలెంట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డెలివరీ హెడ్‌ కండూరి శ్రీనివాస రామానుజం పేర్కొన్నారు. స్థానిక పెదపలకలూరు పరిధిలోని విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతూ ఈ ఏడాది ప్రాంగణ ఎంపికల ద్వారా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన 550 మంది విద్యార్థినుల తల్లిదండ్రులకు శుక్రవారం  ఘన సత్కారం కార్యక్రమం నిర్వహించారు. విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ ఏడాది మొత్తం 550 మంది విద్యార్థినులు ప్రాంగణ ఎంపికల ద్వారా 50కి పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. మొత్తం మీద 98  శాతం మంది విద్యార్థినులు ఆయా సంస్థల్లో కొలువులు కొల్లగొట్టారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినుల తల్లిదండ్రులందరినీ శుక్రవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దలవై సుధీర్‌బాబు   అనే అధ్యాపకుడికి గుంటూరు పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ద స్టడీ ఆఫ్‌ ద డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ సెంటర్స్‌ ఫర్‌ ప్రమోటింగ్‌ ద మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ – ఎ కంపారిటివ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ ద సెలెక్టెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు ఇథియోపియాలోని భూల్‌ హోరా యూనివర్సిటీలోని ప్రొఫెసర్‌ బీకే. సూర్యప్రకాష్‌రావు గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం 2 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్లు, 1 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్‌ పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.

చిత్ర నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న సినెటేరియా మీడియా వర్క్స్

సినెటేరియా మీడియా వర్క్స్: 3 ఏళ్ళలో 60 చిత్రాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ & ఫిలిం ప్రొమోషన్స్- సినెటేరియా మీడియా వర్క్స్ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని, నాలుగవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గడచిన 3 సంవత్సరాల కాలంలో మొత్తం 60 సినిమాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్ ఫిలిం బ్రాండింగ్, ప్రొమోషనల్ బ్రాండింగ్, ఈవెంట్ బ్రాండింగ్ అందించిన సంస్థ, కొత్తవారి సినిమాలతోబాటు పెద్ద హీరోల చిత్రాలకూ పనిచేసింది.  ప్రముఖ నిర్మాతల, దర్శకుల చిత్రాలకూ పనిచేసింది. హీరోలు రవితే, శర్వానంద్, ఆది సాయికుమార్, కిరణ అబ్బవరం, అదిత్ అరుణ్, విశ్వాంత్, సునీల్, నవీన్ చంద్ర, సంపూర్ణేష్ బాబు, కళ్యాణ్ తేజ్, కౌషల్ మండ, కేసరి లాల్ యాదవ్, ప్రియదర్శి, వరుణ్ సందేశ్, హీరోయిన్లు రశ్మిక మందన్న, హన్సికా మోత్వాని, నందితా స్వేత, అనసూయ, వైశాలిరాజ్, ఫరియా అబ్దుల్లా, మేఘాశ్రీ, మిశా నారంగ్, లక్ష్మి రాయ్, మేఘా ఆకాశ్, శ్రీలీల సహా నటించిన చిత్రాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్ / పోస్ట్ ఫిలిం బ్రాండింగ్ ను సినెటేరియా అందించింది. ఫిలిం బ్రాండింగ్ కు మంచి రోజులు ప్రస్తుతం కార్పోరేట్ కంపెనీలు ఫ్మిం బ్రాండింగ్ పట్ల ఆసక్తిని చూయిస్త...

డాక్టర్ సుధారాణి జ్ఞాపకార్థం అన్నదానం

డాక్టర్ సుధారాణి జ్ఞాపకార్థం అన్నదానం తెనాలి: ఉత్తమ విలువలతో విద్యను బోధించిన అధ్యాపకురాలు, డాక్టర్ జాన్ సుధా రాణి ప్రధమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను అద్వర్యం లో జరిగిన కార్యక్రమం లో జాన్ సుధా రాణి భర్త రాజశేఖర్, కుమార్తె సంజన కుటుంబ సభ్యులు కనపర్తి డేవిడ్, ధీరజ్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న భక్త బృంద సభ్యులను అభినందించారు. సేవాకార్యక్రమాలను పట్టణ ప్రజలు ప్రోత్సహించాలన్నారు.

98% మంది విజ్ఞాన్స్‌ నిరుల విద్యార్థినులకు ఉద్యోగాలు

98% మంది విజ్ఞాన్స్‌ నిరుల విద్యార్థినులకు ఉద్యోగాలు స్థానిక పలకలూరులోని విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో  నాలుగో సంవత్సరం చదువుతున్న వారిలో 98% మంది విద్యార్థినులకు ప్రముఖ బహుళజాతి సంస్థలైన టీసీఎస్‌ డిజిటల్, అసెంచర్, ఐబీఎమ్, వర్చూసా, ఇన్ఫోసిస్, విప్రో వంటి బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ పాతూరి రాధిక మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ సన్మాన కార్యక్రమనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఈ సంవత్సరంలో అత్యధికంగా రూ.19 లక్షల వార్షిక ప్యాకేజీతో నాలుగో సంవత్సరానికి చెందిన హేమ స్పందన సత్తా చాటిందన్నారు. అంతేకాకుండా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక వేతనానికి 30 మంది విద్యార్థినులు, రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక వేతనానికి 284 మంది విద్యార్థినులు, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వార్షిక వేతనానికి 400 మందికి పైగా విద్యార్థినులు ఎంపికయ్య...

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ విభాగానికి చెందిన గరిగిపాటి రవి కృష్ణ స్వామి అనే విద్యార్థికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ సాడస్ట్, గ్రానైట్‌ ఫిల్లర్‌ రీఎన్‌ఫోర్డ్స్‌ పాలీబెంజోక్సాజైన్‌ కాంపోసైట్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు యూవర్సిటీలోని ఐక్యూఏసీ డీన్‌ డాక్టర్‌  ఎం.రామక్రిష్ణ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 2 ఈఎస్‌సీఐ జర్నల్‌ పబ్లికేషన్, 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.  పీహెచ్‌డీ పట్టా పొందిన గరిగిపాటి రవి కృష్ణ స్వామిని యూనివర్సిటీ ఐక్యూఏసీ డీన్‌ డాక్టర్‌  ఎం.రామక్రిష్ణ, మెకానికల్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎల్‌.సువర్ణరాజు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.

ASANI CYCLONE .....Alert

Flash ... Flash ... Flash ... ASANI CYCLONE .....Alert ... అ స ని తుఫాన్" సహాయ కార్యక్రమాలను మానిటర్ చేయడానికి 24 గంటలు పనిచేసే విధంగా గుంటూరు కలెక్టరేట్ నందు కంట్రోల్ రూమ్-( ఫోన్ నంబర్ -0863 2234014 ) (వాట్సాప్ నెంబర్ 8121689739 ) ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు తమ సమస్యలను కంట్రోల్ రూమ్ కు తెలియ పరచ వచ్చును. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు  - ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్, గుంటూరు

ఇంటర్నేషనల్‌ బుక్స్‌ పబ్లిష్‌ చేసిన విజ్ఞాన్స్‌ అధ్యాపకులు

ఇంటర్నేషనల్‌ బుక్స్‌ పబ్లిష్‌ చేసిన విజ్ఞాన్స్‌ అధ్యాపకులు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన ఇద్దరు అధ్యాపకులు ఇంటర్నేషనల్‌ బుక్స్‌ ఎడిట్‌ చేసి పబ్లిష్‌ చేశారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన యూనివర్సిటీ రీసెర్చ్‌ అడ్వైజర్‌ ప్రొఫెసర్‌ పీబీ కవికిషోర్‌ ‘‘ జెనటికల్లీ మోడిఫైడ్‌ క్రాప్స్‌ : కరెంట్‌ స్టేటస్, ప్రాస్పెక్ట్స్‌ అండ్‌ చాలెంజెస్‌’’ అనే పుస్తకాన్ని ఎడిట్‌ చేశారని తెలియజేసారు. ఈ పుస్తకాన్ని సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని స్ప్రింగర్‌ నేచర్‌ పబ్లికేషన్‌ ప్రచురించిందని తెలియజేసారు. ఈ పుస్తకాన్ని ఈయనతో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ ప్రొఫెసర్‌ ఎం.వెంకట రాజాం, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ టీ.పుల్లయ్య కూడా ఈ పుస్తకాన్ని రచించడంలో సహాయపడ్డారని తెలియజేసారు. అదే విధంగా బయో టెక్నాలజీ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రంగరావు అంబటి ‘‘ గ్లోబల్‌ పర్‌స్పెక్టివ్‌ ఆన్‌ ఆస్టాజా...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగానికి చెందిన మేథమ్యాటిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరాంజనేయులు జనగం  అనే అధ్యాపకుడికి విజ్ఞాన్స్‌ యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఏ స్టడీ ఆన్‌ సర్క్యులర్‌ డిస్టెన్సెస్‌ ఇన్‌ గ్రాఫ్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  మేథమ్యాటిక్స్‌  విభాగధిపతి ప్రొఫెసర్‌ పీఎల్‌ఎన్‌ వర్మ  గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం 4 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, 1 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్, 1 నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్‌ పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరాంజనేయులు జనగంను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.

అమ్మ మనసు

  అమ్మ మనసు అడుగులు కందకుండ అమ్మనైతి నీ పాదమే మెాస్తి పరులచుాపు సోకకుండా దిష్టి చుక్కనేనైతి అలసిన కన్నులకు జోలనేనైతి ఆకలికి అన్నమైతి బాధలో ఓదార్పునైతి.... . బంధంలో అనుబంధమైతి కాలం పరుగులో నీకు పరాయైతి పనికిరాని వస్తువునైతి పలు మాటలకు గురియైతి... చిత్కారాలకు బలియైతి కాలే కడుపునైతి కందిన మేనినైతి రోడ్డున బ్రతుకైతి.... రోదనల నిలయమైతి రోగిష్టినైతి చిట్టికాలు గుణపమై గుండెలొ దింపగా ముాలుగైతి విలవిల లాడితి .... కన్నీటి చుక్కైతి నే రాలుతున్నా నా ఆశలన్ని నీవైతివి నే చితిలో రగిలినా నీకై దైవంకు వినతైతిని ప్రాణమంతా నీవైతివి...... కడుపుతీపి బిడ్డవైతివి తరలిపోయినా మరలిరాదు అమ్మ బంధం అపురుాప సుగంధం అమ్మని గాంచని చుాపులేలా... అమ్మను ప్రేమించని మనసేలా అమ్మ సంతసించిన బ్రతుకు పదిలం అమ్మ ప్రేమ మధురం సుందరం సుమధురం💕         సందడి అరుణ కుమారి✍

బరువు

బరువు అమ్మ మాట బరువు అమ్మ బాట బరువు అమ్మ కడుపు నింపుట బరువు అమ్మ కష్టంలో సహయం బరువు అమ్మను గాంచలేని వెదవలందరికీ అమ్మ బరువు.... పేరుకు గృహ రాణి గుండెనిండా గునపాల వాణి కంటికి నిద్ర కరువైన కష్టజీవి మెుగుడి మురిపాల్లో మౌన రాగిణి బిడ్డల లాలి పాటలకు వెన్నెల వాహిణి...... పలుకు పలుకులో పరుగుల రాణి దుారమైనా భారమైనా ఇంటికి దీపం తానైనా బాధ్యతల వర్షం పతిదైనాఅ సతిగా చక్కబెట్టు సామ్రాజ్యం  తనదైనా... కిరీటాలు నెత్తినెట్టలేదే కీర్తి కిరీటాలు తానాసించలేదే ప్రతిఫలమాసించని పడతి తానై కదలి పోతుంది బ్రతుకు బాటలో వడలి  పోతుంది... బంధాలను భుజాల మెాస్తుా బాధ్యతలతో అడుగులే వేస్తుా కనికరించే మనసు తానై, అమ్మ ప్రేమ పంచగా.... కన్న కడుపు నింప ముద్ద పెట్టలేని  ముదనష్టపు బిడ్డలేలా భుామికి బరువేల వారికి విలువేల.......        అరుణ సందడి✍

తల్లి ప్రేమ అనిర్వచనీయం…

‘ తల్లి ప్రేమ అనిర్వచనీయం… ’  కొండూరి శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయుడు,  నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు  ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను ఏమీ చేసుకోలేకపోయినా, దీపం పెట్టుకోలేక పోయినా, స్తోత్రం చెప్పుకోలేక పోయినా, తనలో తానే ఏవో సంధిమాటు మాట్లాడుకుంటున్నా, తన బిడ్డకు మాత్రం ఉద్ధారకురాలే.. ఎలా అంటే అమ్మ అంటూ ఒక ఆకారం అక్కడ వుంటేనే కదా! కొడుకుకానీ, కూతురు కానీ వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకోగలిగేది. ఒక వ్యక్తి అలా తన అమ్మకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణం, పదివేసార్లు కాశీయాత్ర చేసిన పుణ్యఫం దక్కుతుందని శాస్త్రం. బిడ్డకు ఇంత పుణ్యం ఇవ్వగలిగిన అమ్మ మాత్రం తనకంటూ తాను ఏమీ చేసుకో...

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:   పాఠకులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని  రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు అన్నారు. శనివారం సాయంత్రం తెనాలి శాఖాగ్రంథాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసారు. గ్రంథాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరచారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రంథాలయాలకు అవసరమేర సదుపాయాలు కల్పిస్తుందన్నారు. పాఠకులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల కార్యదర్శి పీర్ అహ్మద్,  గ్రంథాలయ అధికారి ఝాన్సీ, సిబ్బంది పాల్గొన్నారు,

Online drawing and painting classes for summer camp

భవిష్యత్‌ అంతా ఆర్టిఫిసియల్‌ ఇంటిలెజెన్స్‌దే

భవిష్యత్‌ అంతా ఆర్టిఫిసియల్‌ ఇంటిలెజెన్స్‌దే   హైదరాబాద్‌లోని మ్యాథ్‌వర్క్స్‌ ఇంజినీరింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ శాంతి స్వరూప్‌ మేడసాని రానున్న కాలంలో ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని హైదరాబాద్‌లోని మ్యాథ్‌వర్క్స్‌ ఇంజినీరింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ శాంతి స్వరూప్‌ మేడసాని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘‘ ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ అటానమస్‌ సిస్టమ్స్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ శాంతి స్వరూప్‌ మేడసాని మాట్లాడుతూ విద్యార్థులు డిస్కవరీ, ఇన్వెన్షన్, ఇన్నోవేషన్‌ అనే మూడు అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఏఐæ రంగంలో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవాలనే విద్యార్థులు మెషిన్‌ లెర్నింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్, ప్రోగ్రామింగ్, అనలిటిక్స్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌తో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్‌ డివైస్‌ల డిజైనింగ్‌ కోసం ...

మనసు కవి

మనసు కవి మంగళంపాడులో పుట్టి మధురగేయాలకు మాలియై బ్రతుకు నాటకాలనే రమ్యంగా రచించి దీక్షతో దశలు తిప్పి .... వాగ్ధానంతో వన్నెతెచ్చి డైలాగ్స్ తో ఆనంద వైరాగ్యాలే చుాపి బరువైన పదాలనే పేర్చి అర్దవంతంగా అందరికి అందించి మనసు రచనలెన్నో చేసి... విశ్వశాంతి నాటకానికి ప్రాణం పోసి సామ్రాట్ అశోక ,గౌతమ బుద్ద , నాటకాలకు జీవంపోసి మనసుదోచుకొని మనసున్న కవియై చిత్ర రంగానికే కీర్తికిరీటమై... దైవసంకీర్తనలైనా భక్తి పరవశమైనా శిలలపై శిల్పాలు చెక్కినా ముద్దబంతి పువ్వులనే పుాయించినా నీవులేక వీణగా పలికినా నేను పుట్టాను ఈ లోకం నవ్విందన్నా... ఏ తీగపువ్వన్నా ,విధిచేయు వింతలన్నా సరిగమలు గలగలలై  ఎన్నెన్నో  అద్బుతాలతో మదినిదోచి నాటి నుండి జీవమై వెలుగుతుా వీనుల విందైన సాహిత్యాన్ని అందిస్తుా జనుల మదిలో  నోటిపాటగా చిరంజీవినే ఆచార్య ఆత్రేయగారు చిరస్మరనీయులు🙏🙏              అరుణ సందడి✍ ఆచార్య ఆత్రేయ గారి జయంతిని గుర్తుచేసుకొంటుా🙏

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి రీఫ్రెషర్‌ కోర్స్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి రీఫ్రెషర్‌ కోర్స్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డివిజన్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్, ఇండియన్‌ అకడమీ ఆఫ్‌ సైన్సెస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి రీఫ్రెషర్‌ కోర్సును శుక్రవారం నుంచి ప్రారంభించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ సైన్స్‌ అకడెమీస్‌ రీఫ్రెషర్‌ కోర్స్‌ ఆన్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ టెక్నిక్స్‌: న్యూ ఫాసెట్స్‌ ఇన్‌ కాంటెంపరరీ ఫీల్డ్స్‌ ఆఫ్‌ కెమికల్, మెటీరియల్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌’’ అనే అంశంపై ఈ కోర్సును ప్రారంభించామన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్‌ అకడమీ ఆఫ్‌ సైన్స్‌ కోర్సు డైరక్టర్‌ ప్రొఫెసర్‌ దిలిప్‌ ధవాలే మాట్లాడతూ సైన్స్‌లో వస్తున్న నూతన ఆవిష్కరణలు సమాజాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. నిత్యజీవితం...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎంవీ రాజు  అనే అధ్యాపకుడికి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఏ స్టడీ ఆన్‌ ద క్యారక్టెరిస్టిక్స్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సాయిల్స్‌ ఆఫ్‌ గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా విత్‌ స్పెషల్‌ రెఫరెన్స్‌ టు రైస్, కాటన్‌ అండ్‌ టొబాకో క్రాప్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు ఆంధ్ర యూనివర్సిటీలోని  ఎన్విరాన్‌మెంట్‌ హానరరీ ప్రొఫెసర్‌ పెద్దినేని ప్రసాద్‌రావు  గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం ఎస్‌సీఐ 2, స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్‌ 2, 4 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన ఎంవీ రాజును  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ...

ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ పై పట్టు సాదిస్తే అదిరిపోయే కొలువలు

ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై పట్టు సాధించిన విద్యార్థులు అదిరిపోయే కొలువలు - యూఎస్‌ఏలోని కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై పట్టు సాధించిన విద్యార్థులు అదిరిపోయే కొలువలు సాధించవచ్చునని యూఎస్‌ఏలోని కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీలోని మెషిన్‌ లెర్నింగ్‌ డిపార్ట్‌మెంట్‌ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘‘ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌’’పై విద్యార్థులకు ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె మాట్లాడుతూ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ స్కిల్స్‌పై పట్టు ఉంటేనే మల్టి నేషనల్‌ కంపెనీలు అభ్యర్థుల వైపు చూసే పరిస్థితి ఉందన్నారు. యువత ఈ ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. హెల్త్‌కేర్, డిజిటల్‌ ఫైనాన్స్, క్యాన్సర్‌ నివారణ, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, లాజిస్టిక్స్‌ మొదలు అన్ని రంగాల్లో మెషిన్‌ లెర్నింగ్‌ అప్లికేషన్స్‌ విని...