జీపాట్‌–2022లో విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థుల సత్తా

జీపాట్‌–2002లో విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థుల సత్తా

న్యూఢిల్లీలోని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన జీపాట్‌(గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)–2022లో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు సత్తాచాటారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసబాబు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. జీపాట్‌–2022లో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులలో జీ.ఔచిత్య(845), ఎన్‌.సుధాకర్‌ రెడ్డి (1509), ఆర్‌.సాయి కిరణ్‌ నాయక్‌ (2085), ఎన్‌.మేఘన(2183), వి.అంక రాజేశ్వరిæ(3133),  ఎస్‌.శ్రీవల్లి (3343), ఎం.జాహ్నవి (3574), బీ.నాసరయ్య (4201), ఈ.దుర్గా గాయత్రి (4678), బీ.సన్నీ (9950)లు ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణత పొందిన ప్రతి విద్యార్థికి నెలకు రూ. 12,500 వేతనాన్ని ఏఐసీటీఈ చెల్లిస్తుందని తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, ఆయా విభాగాల అధిపతులు అభినందించారు.