98% మంది విజ్ఞాన్స్‌ నిరుల విద్యార్థినులకు ఉద్యోగాలు

98% మంది విజ్ఞాన్స్‌ నిరుల విద్యార్థినులకు ఉద్యోగాలు

స్థానిక పలకలూరులోని విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో  నాలుగో సంవత్సరం చదువుతున్న వారిలో 98% మంది విద్యార్థినులకు ప్రముఖ బహుళజాతి సంస్థలైన టీసీఎస్‌ డిజిటల్, అసెంచర్, ఐబీఎమ్, వర్చూసా, ఇన్ఫోసిస్, విప్రో వంటి బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ పాతూరి రాధిక మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ సన్మాన కార్యక్రమనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఈ సంవత్సరంలో అత్యధికంగా రూ.19 లక్షల వార్షిక ప్యాకేజీతో నాలుగో సంవత్సరానికి చెందిన హేమ స్పందన సత్తా చాటిందన్నారు. అంతేకాకుండా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక వేతనానికి 30 మంది విద్యార్థినులు, రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక వేతనానికి 284 మంది విద్యార్థినులు, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వార్షిక వేతనానికి 400 మందికి పైగా విద్యార్థినులు ఎంపికయ్యారని వెల్లడించారు. విభాగాల వారీగా పరిశీలించినట్లైతే సీఎస్‌ఈ విభాగం నుంచి 99% మంది విద్యార్థినులు, ఈసీఈ విభాగం నుంచి 98% మంది విద్యార్థినులు, ఐటీ విభాగం నుంచి 99% మంది విద్యార్థినులు, ఈఈఈ విభాగం నుంచి 97% మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ తమ కళాశాలలో చదివే విద్యార్థులకు డిగ్రీ పట్టాతో పాటు, కళాశాలలో ఉన్నప్పుడే ఉద్యోగం వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం వల్లే విద్యార్థులు వివిధ బహుళజాతి సంస్థలకు ఎంపికై సత్తాచాటుతున్నారని పేర్కొన్నారు. తమ కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి ఇంజినీరింగ్‌ విద్యతో పాటు ప్రత్యేక తరగతులు, మేము అవలంభించే కౌన్సిలింగ్‌ సిస్టం విధానం, ప్రత్యేక ట్రైనింగ్‌ క్లాస్‌లే కారణమని పేర్కొన్నారు. విద్యార్థులను బలవంతంగా, బాధతో చదివించడం కాకుండా.... విద్యార్థులే స్వతహాగా చదువుకునే విధంగా ప్రోత్సాహించటం, ఆలోచన కలిగించటం, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే అభిరుచిని కలగజేస్తామన్నారు.   ప్రతి కంపెనీకి కావలసిన నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని... వాటికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక, ఉపాధి కల్పనాధికారులు, ఆయా విభాగాల అధిపతులు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.