ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ పై పట్టు సాదిస్తే అదిరిపోయే కొలువలు


ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై పట్టు సాధించిన విద్యార్థులు అదిరిపోయే కొలువలు
- యూఎస్‌ఏలోని కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె

ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై పట్టు సాధించిన విద్యార్థులు అదిరిపోయే కొలువలు సాధించవచ్చునని యూఎస్‌ఏలోని కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీలోని మెషిన్‌ లెర్నింగ్‌ డిపార్ట్‌మెంట్‌ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘‘ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌’’పై విద్యార్థులకు ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె మాట్లాడుతూ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ స్కిల్స్‌పై పట్టు ఉంటేనే మల్టి నేషనల్‌ కంపెనీలు అభ్యర్థుల వైపు చూసే పరిస్థితి ఉందన్నారు. యువత ఈ ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. హెల్త్‌కేర్, డిజిటల్‌ ఫైనాన్స్, క్యాన్సర్‌ నివారణ, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, లాజిస్టిక్స్‌ మొదలు అన్ని రంగాల్లో మెషిన్‌ లెర్నింగ్‌ అప్లికేషన్స్‌ వినియోగం పెరిగిందన్నారు. అంతర్జాతీయంగా అన్ని వ్యవస్థలను కుదేలు చేసిన కోవిడ్‌ కారణంగా ఆయా రంగాల్లో మందగమనం కొనసాగుతోందన్నారు. అయితే కోవిడ్‌ అనంతర కాలంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం శరవేగంగా పెరిగిందన్నారు. ప్రముఖ కంపెనీలన్నీ తమ ప్రాజెక్టులను నిరంతరం కొనసాగించడానికి ఏఐ సాంకేతికతనే వినియోగిస్తున్నాయని విద్యార్థులకు తెలియజేసారు. విజ్ఞాన్స్‌ లారా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నేజీ మెలాన్‌ యూనివర్సిటీ నందు ‘‘ ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌’’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసుకుని యూఎస్‌ఏలోని మసాచు సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నందు పోస్ట్‌ డాక్టరేట్‌ పొందిన సిద్ధార్థ్‌ అంచె మా కళాశాలకు వచ్చి విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూఎస్‌ఏలోని కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీ రీసెర్చర్‌ అమంద కాస్టోన్, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.