ఇంటర్నేషనల్‌ బుక్స్‌ పబ్లిష్‌ చేసిన విజ్ఞాన్స్‌ అధ్యాపకులు

ఇంటర్నేషనల్‌ బుక్స్‌ పబ్లిష్‌ చేసిన విజ్ఞాన్స్‌ అధ్యాపకులు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన ఇద్దరు అధ్యాపకులు ఇంటర్నేషనల్‌ బుక్స్‌ ఎడిట్‌ చేసి పబ్లిష్‌ చేశారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన యూనివర్సిటీ రీసెర్చ్‌ అడ్వైజర్‌ ప్రొఫెసర్‌ పీబీ కవికిషోర్‌ ‘‘ జెనటికల్లీ మోడిఫైడ్‌ క్రాప్స్‌ : కరెంట్‌ స్టేటస్, ప్రాస్పెక్ట్స్‌ అండ్‌ చాలెంజెస్‌’’ అనే పుస్తకాన్ని ఎడిట్‌ చేశారని తెలియజేసారు. ఈ పుస్తకాన్ని సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని స్ప్రింగర్‌ నేచర్‌ పబ్లికేషన్‌ ప్రచురించిందని తెలియజేసారు. ఈ పుస్తకాన్ని ఈయనతో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ ప్రొఫెసర్‌ ఎం.వెంకట రాజాం, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ టీ.పుల్లయ్య కూడా ఈ పుస్తకాన్ని రచించడంలో సహాయపడ్డారని తెలియజేసారు. అదే విధంగా బయో టెక్నాలజీ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రంగరావు అంబటి ‘‘ గ్లోబల్‌ పర్‌స్పెక్టివ్‌ ఆన్‌ ఆస్టాజాంతిన్‌ : ఫ్రమ్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ టు ఫుడ్, హెల్త్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ అప్లికేషన్స్‌’’ అనే పుస్తకాన్ని ఎడిట్‌ చేశారని తెలిపారు. ఈ పుస్తకాన్ని యూఎస్‌ఏలోని అకడిమిక్‌ ప్రెస్‌ పబ్లికేషన్స్‌ వారు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. ఈ పుస్తకాన్ని ఈయనతో పాటు బెంగళూరులోని దయానంద సాగర్‌ ఇనిస్టిట్యూషన్స్‌లోని లైఫ్‌ సెన్సెస్‌ విభాగానికి చెందిన వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ జీఏ రవిశంకర్‌ కూడా రచించారని పేర్కొన్నారు. వివిధ విభాగాలలో పుస్తకాలు ప్రచురించిన బయోటెక్నాలజీకు చెందిన ఇద్దరు అధ్యాపకులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు.