Skip to main content

మతసామరస్యాన్ని కాపాడే రచనలను ప్రోత్సహించాలి

మతసామరస్యాన్ని కాపాడే రచనలను ప్రోత్సహించాలి 

- దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్      ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 
- ఘనంగా సాక్షాత్కారము పుస్తక ఆవిష్కరణ సభ 
-పేదలకు నూతన వస్త్రాల పంపిణి 

తెనాలి: మత సామరస్యాన్ని కాపాడే రచనల అవసరత ఎంతైనా ఉందని, అలాంటి రచనలు చేస్తున్న రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దళిత సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు.  కొత్తపేట లోని పెన్షనర్స్ హాల్ లో ఆదివారం రాత్రి పట్టణానికి చెందిన రచయిత కనపర్తి డేవిడ్ రచించిన సాక్షాత్కారము పుస్తక ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. సభకు డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ అధ్యక్షత వహించారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని సాక్షాత్కారము పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య కృపాచారి మాట్లాడుతూ కనపర్తి కలం పేరుతో రచనలు చేస్తున్న రచయిత డేవిడ్ మత గ్రంథాల్లోన్ని సారాంశాలను సులువైనరీతిలో సామాన్యులకు అర్థమయ్యేలా రచనలు చేస్తున్నారని ప్రశంసించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు, సహజకవి అయినాల మల్లేశ్వరరావు సాక్షాత్కారము పుస్తక విశ్లేషణ చేసారు. అధ్యక్షత వహించిన డాక్టర్ అబ్రహాం లింకన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరచు కోవాలని ఇందుకు సాక్షాత్కారము వంటి రచనలు ఉపయోగపడతాయన్నారు. రెవరెండ్ డి. సాల్మన్ రాజు మాట్లాడుతూ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం హర్షణీయం అన్నారు. 
అనంతరం సాక్షాత్కారము పుస్తక రచయిత డేవిడ్ ను పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు సత్కరించారు. సభలో కనపర్తి కృపాదాసు, బాబురావు, ఏసురత్నం, దేవిశెట్టి కృష్ణారావు, ఆర్.అండ్ రాజు, ఉపాధ్యాయులు విజయ ప్రకాష్, బెన్ హర్, వెంకటేశ్వరరావు, అంబేద్కర్, గోగినేని రత్నాకర్, పాతూరి సుబ్రహ్మణ్యం, సుధీర్, ,రవికిరణ్, పీ. గోపి, పాత్రికేయులు టి. రవీంద్రబాబు, గుమ్మడి ప్రకాశరావు, జి. ప్రభాకర్, శ్రీకాంత్, జహీర్, ప్రేమ కుమార్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. 

కార్యక్రమాన్ని రత్నాకర్ మధుకర్, పవన్, రాజశేఖర్, సమత కిరణ్ లు పర్యవేక్షించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...