సృజనాత్మకతను వెలికితీసేందుకు లఘు చిత్రాలు దోహదపడతాయి

సృజనాత్మకతను వెలికితీసేందుకు లఘు చిత్రాలు దోహదపడతాయి.
- దర్శకుడు రత్నాకర్ కనపర్తి


తెనాలి: సృజనాత్మక కళలను వెలికితీసేందుకు లఘుచిత్రాలు దోహదపడతాయని దర్శకుడు రత్నాకర్ కనపర్తి అన్నారు. స్థానిక మారీసుపేటలోని తెనాలికింగ్స్ స్టూడియోలో 
ఏ. జీ. వి. ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత బి. వెంకటేశ్వరరావు నిర్మించి, వెంకీ (బ్లాక్ బాయ్) దర్శకత్వంలో 
వేర్ ఈజ్ శైలజ అనే లఘు చిత్రాన్ని యు ట్యూబ్ ద్వారా విడుదల చేసారు. చిత్ర విడుదల కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రత్నాకర్ మాట్లాడుతూ చిత్ర దర్శకుడు వెంకీ పలు చిత్రాలలో నటించాడని, దర్శకునిగా పలు లఘుచిత్రాల ను రూపొందించాడు అని చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రాలు రూపొందించి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. యువదర్శకులను ప్రోత్సహిస్తున్న వెంకటేశ్వర రావు ను అభినందించారు.
దర్శకుడు వెంకీ మాట్లాడుతూ గతంలో తాను రూపొందించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.  నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతన కళాకారులను తమ సంస్థ ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో..