అమ్మ మనసు

 అమ్మ మనసు

అడుగులు కందకుండ అమ్మనైతి
నీ పాదమే మెాస్తి
పరులచుాపు సోకకుండా దిష్టి చుక్కనేనైతి
అలసిన కన్నులకు జోలనేనైతి
ఆకలికి అన్నమైతి
బాధలో ఓదార్పునైతి....
.
బంధంలో అనుబంధమైతి
కాలం పరుగులో నీకు పరాయైతి
పనికిరాని వస్తువునైతి
పలు మాటలకు గురియైతి...

చిత్కారాలకు బలియైతి
కాలే కడుపునైతి
కందిన మేనినైతి
రోడ్డున బ్రతుకైతి....

రోదనల నిలయమైతి
రోగిష్టినైతి
చిట్టికాలు గుణపమై గుండెలొ దింపగా ముాలుగైతి
విలవిల లాడితి ....

కన్నీటి చుక్కైతి
నే రాలుతున్నా నా ఆశలన్ని నీవైతివి
నే చితిలో రగిలినా నీకై దైవంకు వినతైతిని
ప్రాణమంతా నీవైతివి......

కడుపుతీపి బిడ్డవైతివి
తరలిపోయినా మరలిరాదు
అమ్మ బంధం అపురుాప సుగంధం
అమ్మని గాంచని చుాపులేలా...

అమ్మను ప్రేమించని మనసేలా
అమ్మ సంతసించిన బ్రతుకు పదిలం
అమ్మ ప్రేమ మధురం
సుందరం సుమధురం💕

        సందడి అరుణ కుమారి✍