మనసు కవి

మనసు కవి

మంగళంపాడులో పుట్టి
మధురగేయాలకు మాలియై
బ్రతుకు నాటకాలనే రమ్యంగా
రచించి
దీక్షతో దశలు తిప్పి ....

వాగ్ధానంతో వన్నెతెచ్చి
డైలాగ్స్ తో ఆనంద వైరాగ్యాలే చుాపి
బరువైన పదాలనే పేర్చి
అర్దవంతంగా అందరికి అందించి
మనసు రచనలెన్నో చేసి...

విశ్వశాంతి నాటకానికి ప్రాణం పోసి
సామ్రాట్ అశోక ,గౌతమ బుద్ద ,
నాటకాలకు జీవంపోసి
మనసుదోచుకొని మనసున్న కవియై
చిత్ర రంగానికే కీర్తికిరీటమై...

దైవసంకీర్తనలైనా భక్తి పరవశమైనా
శిలలపై శిల్పాలు చెక్కినా
ముద్దబంతి పువ్వులనే పుాయించినా
నీవులేక వీణగా పలికినా
నేను పుట్టాను ఈ లోకం నవ్విందన్నా...

ఏ తీగపువ్వన్నా ,విధిచేయు వింతలన్నా
సరిగమలు గలగలలై
 ఎన్నెన్నో  అద్బుతాలతో మదినిదోచి
నాటి నుండి జీవమై వెలుగుతుా
వీనుల విందైన సాహిత్యాన్ని అందిస్తుా
జనుల మదిలో  నోటిపాటగా చిరంజీవినే
ఆచార్య ఆత్రేయగారు చిరస్మరనీయులు🙏🙏
            
అరుణ సందడి✍

ఆచార్య ఆత్రేయ గారి జయంతిని గుర్తుచేసుకొంటుా🙏