విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగానికి చెందిన మేథమ్యాటిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరాంజనేయులు జనగం  అనే అధ్యాపకుడికి విజ్ఞాన్స్‌ యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఏ స్టడీ ఆన్‌ సర్క్యులర్‌ డిస్టెన్సెస్‌ ఇన్‌ గ్రాఫ్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  మేథమ్యాటిక్స్‌  విభాగధిపతి ప్రొఫెసర్‌ పీఎల్‌ఎన్‌ వర్మ  గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం 4 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, 1 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్, 1 నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్‌ పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరాంజనేయులు జనగంను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.