భవిష్యత్‌ అంతా ఆర్టిఫిసియల్‌ ఇంటిలెజెన్స్‌దే

భవిష్యత్‌ అంతా ఆర్టిఫిసియల్‌ ఇంటిలెజెన్స్‌దే

  హైదరాబాద్‌లోని మ్యాథ్‌వర్క్స్‌ ఇంజినీరింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ శాంతి స్వరూప్‌ మేడసాని

రానున్న కాలంలో ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని హైదరాబాద్‌లోని మ్యాథ్‌వర్క్స్‌ ఇంజినీరింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ శాంతి స్వరూప్‌ మేడసాని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘‘ ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ అటానమస్‌ సిస్టమ్స్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ శాంతి స్వరూప్‌ మేడసాని మాట్లాడుతూ విద్యార్థులు డిస్కవరీ, ఇన్వెన్షన్, ఇన్నోవేషన్‌ అనే మూడు అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఏఐæ రంగంలో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవాలనే విద్యార్థులు మెషిన్‌ లెర్నింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్, ప్రోగ్రామింగ్, అనలిటిక్స్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌తో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్‌ డివైస్‌ల డిజైనింగ్‌ కోసం ఆటోక్యాడ్‌ టెక్నాలజీ అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. స్మార్ట్‌ డివైసెస్, స్మార్ట్‌ హోమ్స్, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, రోబోటిక్స్‌ వంటి రంగాలు వేగంగా విస్తరిస్తుండటం వలన ఏఐలో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని వెల్లడించారు. డిజిటల్‌ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకు సరికొత్త పుంతలు తొక్కుతుందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మన దైనందిన జీవితాలను మరింత సౌకర్యవంతం చేస్తుందన్నారు.