Skip to main content

Posts

Showing posts from June, 2022

రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ని కలిసిన ఏపిడబ్ల్యుజేఎఫ్ బృందం

రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ని కలిసిన ఏపిడబ్ల్యుజేఎఫ్ బృందం     విజయవాడ: వృత్తి పన్ను వేసి జర్నలిస్టుల పై ఆర్థిక భారాన్ని మోపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) ప్రతినిధులబృందం బుధవారం మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా హెల్త్ కార్డుల పునరుద్ధరణ గురించి, జర్నలిస్టుల ప్రమాదభీమా గురించి, మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఇచ్చే పెన్షన్ స్కీం గురించి, చిన్నపత్రికలకు మెడమీద కత్తిలా మారిన జి.ఎస్ టి  గురించి ఫెడరేషన్ ప్రతినిధుల బృందం కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళింది. కమిషనర్ స్పందిస్తూ, వృత్తి పన్ను విషయం మా డిపార్టుమెంటుకు సంబంధించింది  కాదు కాబట్టి విషయాన్ని ఆయా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే హెల్త్ కార్డుల పునరుద్ధరణ కార్యక్రమం, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చే పెన్షన్ విషయంరెండూ ప్రాసెస్ లో వున్నాయని, త్వరలోనే ఆ రెండు పూర్తిచేస్తామని చెప్పారు. ఇక ప్రమాదభీమా విషయానికి సం...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్‌పీటీఈల్‌ ర్యాంకింగ్స్‌లో ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వయం ఎన్‌పీటీఈఎల్‌ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జాతీయస్థాయిలో 18వ ర్యాంక్‌ సాధించి ‘‘ఏఏ గ్రేడ్‌’’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు పాల్గొని 1627 కోర్సు సర్టిఫికెట్లు సాధించారన్నారు. వీటిలో 45 మందికి టాపర్స్, 19 గోల్డ్, 234 సిల్వర్, 669 ఎలైట్, 705 మంది సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్స్‌ సాధించారని వెల్లడించారు. 2022వ సంవత్సరంలో ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు నిర్వహించిన కోర్సులలో ఉత్తమ ప్రతిభకు గాను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని వెల్లడించారు. ‘‘ఏఏ గ్రేడ్‌’’కు సంబంధించిన సర్టిఫికెట్‌ను...

మహా దార్శనికుడు పి.విఘనంగా 101 వ జయంతి వేడుకలు

మహా దార్శనికుడు పి.వి ఘనంగా 101 వ జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ పాత పోస్ట్ ఆఫీస్.. జూన్ 28.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం  కృషి చేయడంతో పాటు భూసంస్కరణలు అమలు చేసిన మహా దార్శనికుడు పీవీ నరసింహారావు అని పలువురు ప్రముఖులు  కొనియాడారు.. పాతనగరంలోని వివేకానంద అనాధ, వృద్ధుల ఆశ్రమంలో మంగళవారం పీవీ నరసింహారావు 101 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  సంఘ సేవకులు,, ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్  మాట్లాడుతూ దేశం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పివి మెరుగైన పరిపాలన అందించారన్నారు, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి తన వంతు కృషి చేశారని , ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించిన ఘనత ఆయన సొంతం అన్నారు. దక్షిణ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  ద్రోణము రాజు శ్రీ వాత్సవ మాట్లాడుతూ తమ తాత  ద్రోనము రాజు సత్యనారాయణ  ద్వారా పీవీ నరసింహారావు ను కలుసుకోవడం తన జీవితంలో గొప్ప మధురానుభూతి గా పేర్కొన్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన పివి నేటి...

ప్రభుత్వం జర్నలిస్టులపై మోపిన వృత్తి పన్ను భారాన్ని వెంటనే రద్దు చేయాలి

ప్రభుత్వం జర్నలిస్టులపై మోపిన వృత్తి పన్ను భారాన్ని వెంటనే రద్దు చేయాలి _ వృత్తి పన్ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జర్నలిస్టులు _ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన తెనాలి: రాష్ట్రప్రభుత్వం ఇటీవల జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వారిపై వృత్తిపన్ను మోపడాన్ని నిరసిస్తూ స్థానిక సబ్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు తేళ్ల రవీంద్ర బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టులపై వృత్తి పని భారాన్ని మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రతుకు భారమై జీవించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులపై మోపిన వృత్తి పన్ను భారాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా, జీవిత బీమా సౌకర్యాలను కల్పించాలన్నారు. వీటితో పాటు అక్రెడిటేషన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ  ప్రభుత్వం జర్నలిస్టులపై నిర్లక్ష్య, ఉదాసీన దోరనితో ...

జర్నలిస్టుల సమస్యలపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన

జర్నలిస్టుల సమస్యలపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన విశాఖపట్నం, జూన్ 27, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్లు సంయుక్తంగా సోమవారం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, వృత్తి పన్ను రద్దు చేయాలని,ఇళ్ల స్థలాలు కేటాయించాలని,విశాఖపట్నంలో 1996 మరియు 2009లో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల సమస్యను సత్వరం పరిష్కరించాలని,మీడియా అకాడమీ ఏర్పాటు చేయాలని, పెన్షన్ పథకం,ఆరోగ్య భీమా అమలు చేయాలని, జర్నలిస్టులకు అవార్డులు ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ గత మూడు ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని,అక్రిడేషన్లు విషయంలో అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తపరిచారు.ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కొత్తగా వృత్తి పన్ను ప్రతి జర్నలిస్టు 2500 ర...

మత్తుతో జీవితం చిత్తు

మత్తుతో జీవితం చిత్తు - గుంటూరు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ డీ.ఎన్‌.మహేష్‌   దిశ చట్టంతో మహిళలకు రక్షణ : గుంటూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అన్నపూర్ణ   మత్తు పదార్థాల వాడకం ప్రాణాంతకం : అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.మణికంఠ   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో  డ్రగ్‌ అడిక్షన్‌ అండ్‌ అబ్యూజ్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు మత్తు పదార్థాల వాడకంతో జీవితం చిత్తు చిత్తు అవుతుందని గుంటూరు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ డీ.ఎన్‌.మహేష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘‘అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ డ్రగ్‌ అడిక్షన్‌ అండ్‌ అబ్యూజ్‌’’ అనే అంశంపై ‘‘ సే నో టు డ్రగ్స్‌’’ అని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ డీ.ఎన్‌.మహేష్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ తీసుకోవడం సరదాగా మొదలుపెట్టే ఈ అలవాటు చివరకు వారిని బానిసను చేస్తుందన్నారు. డ్రగ్స్‌ కోసం నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనుకాడబోరన్నారు. స్నేహితులు, బంధువులు అందర...

విజ్ఞాన్స్‌ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు 100% ప్లేస్‌మెంట్స్‌

విజ్ఞాన్స్‌ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు 100% ప్లేస్‌మెంట్స్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యసించిన విద్యార్థులు 100% ప్లేస్‌మెంట్స్‌ సాధించారని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సును పూర్తిచేసిన మొదటి బ్యాచ్‌ విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులందరూ ఉద్యోగాలకే పరిమితం అవ్వకుండా ఇండస్ట్రీలోనే ఉంటారు కాబట్టి పరిశోధనల వైపు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ ప్రముఖ బహుళజాతి ఫార్మా కంపెనీలైన ఎంఎస్‌ఎన్‌ ల్యాబరేటరీస్, హెటిరో డ్రగ్స్, దివిసీ ల్యాబరేటరీస్, సింగ్రీన్‌ ఫార్మా, బైఫోర్‌ ఫార్మాస్యూటికల్స్‌కు ఎంపికయ్యారని వెల్లడించారు. మరికొంతమంది విద్యార్థులు ప్రముఖ టెక్నో స్కూల్స్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. విద్యార్థులను తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయకుండా ఆరు నెలల పాటు ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌కు కూడా పంపిస్తున్నామని తెలియజేసారు. ప్రముఖ బహుళజా...

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుకై విజయసాయిరెడ్డి హామీ

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుకై విజయసాయిరెడ్డి హామీ . విశాఖపట్నం జూన్ 23. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సంసిద్ధంగా ఉన్నారని వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి చెప్పారు గురువారం ఉదయం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకువచ్చిన విజయసాయిరెడ్డిని  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహా విశాఖ నగర శాఖ అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్,ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావులు కలిసి జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను విజయసాయిరెడ్డికి వివరించారు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాల మాదిరిగానే ప్రభుత్వం ప్రతీ జర్నలిస్టుకు కనీసం మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని కోరారు.జర్నలిస్టుల  హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను పలు ప్రైవేటు ఆసుపత్రులు  అనుమతించనందున ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తగు ఆర్థిక...

ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి

ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జే.మోహనరావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు ఏ.హేమలత (984), జీ.యశ్వంత్‌ (982), కే.హర్షవర్ధన్‌ (982), ఎండీ సుభానీ(981), పీ.శివతేజ (980) మార్కులు సాధించారన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఎం.కవిత (466), ఆర్‌.శివకుమార్‌ (464), డీ.నీరజ్‌బాబు (464), కే.హెచ్‌. వర్ధన్‌ చౌదరీ(464), జీ.జితేంద్ర మోహన్‌ (463), డీ.రమేష్‌ (463), కేఎన్‌ఎన్‌ఎంహెచ్‌ శశాంక్‌ (463) మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 450కు పైగా మార్కులు 100 మంది సాధించారని పేర్కొన్నారు. రెండో సంవత్సరం విద్యార్థుల్లో 970కి పైగా మార్కులు 50 మంది సాధించారని తెలియజేసారు. అద్భత ఫలితాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు...

నైపర్‌ జేఈఈ–2022లో సత్తాచాటిన విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు

నైపర్‌ జేఈఈ–2022లో సత్తాచాటిన విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు నైపర్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) జేఈఈ–2022 జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి జాతీయస్థాయిలో సత్తాచాటారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళాశాలకు చెందిన జి.ఔచిత్య(304), బి.నాసరయ్య(878), ఎస్‌.శ్రీవల్లీ(1101), ఎన్‌.సుధాకర్‌ రెడ్డి (1537), ఈ.దుర్గా గాయత్రి‡(1987), ఎం.జాహ్నవి (2660), వి.అంక రాజేశ్వరి (2725), ఎన్‌.మేఘన (2980), ఆర్‌.సాయి కిరణ్‌ నాయక్‌ (3164) ర్యాంకులతో సత్తాచాటారని తెలియజేసారు. ఈ జాతీయస్థాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏఐసీటీఈ ప్రతి నెల రూ.12,400 స్కాలర్‌షిప్‌ లభిస్తుందని వెల్లడించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, కళాశాల జీప్యాట్‌ కమిటీ సభ్యులు, ...

మానవాళికి యోగా అనిర్వచనీయం

మానవాళికి యోగా అనిర్వచనీయం  _ ఆంధ్రప్రదేశ్‌ యోగా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వీవీ రామారావు ప్రపంచ మానవాళికి యోగా అనేది అనిర్వచనీయమైనదని ఆంధ్రప్రదేశ్‌ యోగా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వీవీ రామారావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఇంటర్నేషనల్‌ యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం యోగా డేను ‘‘ యోగా ఫర్‌ హార్మనీ అండ్‌ పీస్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ యోగా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వీవీ రామారావు మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వలన ఏ వ్యాధి దగ్గరకు రాదని, శరీరంలోని రుగ్మతలన్నీ తొలగిపోయి ప్రాణశక్తి పెరుగుతుందన్నారు. యోగా చేయడం వలన ఏకాగ్రత పెరుగడంతోపాటు శారీరక ధృఢత్వం, మానసిక ఒత్తిడి దూరమవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనము నుంచే యోగాసనాలపై ఆసక్తిని కలుగుజేయాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ యోగా అనేది శాస్త్రబద్ధమైన జీవన విధానమన్నారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడ...

నటులుగా రాణించడానికి సరైన మార్గం రంగస్థలం

నటులుగా రాణించడానికి సరైన మార్గం రంగస్థలం  - సినీ టీవీ నటి,దర్శకురాలు డా.శ్రీజ సాదినేని లక్ష్యం ఉన్నతంగా ఉంటే సరిపోదు, అందుకు ప్రణాళిక కూడా సరిగ్గా వేసుకుంటేనే లక్ష్య సాధన సాధ్యం అవుతుంది అని ప్రముఖ సినీ నటి,రచయిత్రి,దర్శకురాలు డా శ్రీజ సాదినేని తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లమాకాన్ లో శనివారం రాత్రి శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ సమర్పణలో, డా.శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన  " పద్మవ్యూహం " నాటిక ప్రదర్శించారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మీడియాతో ముచ్చటించారు.ప్రముఖ సినీ రచయిత, నటులు, దర్శకులు శ్రీ ఎల్.బి.శ్రీరామ్ రచించిన పద్మవ్యూహం నాటిక సగటు మనిషి సమస్యల్ని కష్టాల్ని సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది. ఈ నాటికలో పది పాత్రలు ఉంటే వాటిని కేవలం ముగ్గురు ఆర్టిస్టులు మాత్రమే పోషించడం ఈ నాటిక ప్రత్యేకత అని డా.శ్రీజ అన్నారు.సినీ పరిశ్రమలో నటులుగా కొనసాగాలని ఎంతోమంది ఆశ పడుతుంటారని అయితే సరైన మార్గం తెలియక సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, సమయాన్ని,డబ్బుని వృధా చేసుకుంటున్నారని, అటువంటి వారు రంగస్థల నటనలో శిక్షణ తీసుకుంటే నటులుగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని...

రంగస్థలం లోకి యువతకు ఆహ్వానం

రంగస్థలం లోకి యువతకు ఆహ్వానం ... శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న థియేటర్ యాక్టింగ్ వర్క్ షాప్ కి అడ్మిషన్స్ ప్రారంభం. థియేటర్ ఆర్ట్స్ లో యువతకు నైపుణ్యాన్ని, మెళకువలను నేర్పేందుకు శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారు 29వ మరియు 30వ థియేటర్ యాక్టింగ్ వర్క్ షాప్ లను 2022 జూన్ 20 నుండి ప్రారంభిస్తోంది. 2003 వ సం. నుండి ఇప్పటి వరకూ 28 వర్క్ షాప్ లను నిర్వహించి ఎంతోమంది నటీనటులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా రంగస్థల, టీవీ, సినీ రంగాలలో అవకాశాలు ఇప్పించిన శ్రీ జయా ఆర్ట్స్ ఇప్పుడు రెండు వర్క్ షాప్ లను ఒకేసారి నిర్వహిస్తోంది. 2022 జూన్ 20 నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు  2022 జూన్ 25 నుండి శని ఆదివారాలలో వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది. 2022 జూన్ 18 శనివారం మరియు జూన్ 19 ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లమాకాన్ లో  ప్రముఖ సినీ నాటక రచయిత శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు రచించిన పద్మవ్యూహం నాటికను ప్రదర్శిస్తోంది.  ఈ నాటిక ప్రదర్శనకు టికెట్ బుకింగ్ అలాగే వర్క్ షాప్ అడ్మిషన్స్ కోసం బుక్ మై షో  లేదా 9949910366 నెంబర్లలో సంప్రదించవచ్చు.

ప్రణాళికతో కష్టపడితే సాధ్యమే

ప్రణాళికతో కష్టపడితే సాధ్యమే  _ ఆలిండియా సివిల్స్‌ 157వ ర్యాంకర్‌ కే.మనోజ్‌ కుమార్‌ విద్యార్థులు ప్రణాళికబద్దంగా కష్టపడి చదివితే సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సాధ్యమేనని ఆలిండియా సివిల్స్‌ 157వ ర్యాంకర్‌ కే.మనోజ్‌ కుమార్‌  తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని సివిల్స్‌ సర్వీసెస్‌ అకడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘‘సివిల్స్‌ పరీక్షను ఎలా అధిగమించవచ్చు?’’ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది సివిల్స్‌ ర్యాంకర్‌ మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ  సివిల్స్‌ సాధించాలనే విద్యార్థులు ముందుగా సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. తర్వాత మార్కెట్‌లో ఉన్న అనవసరమైన పుస్తకాలను చదవకుండా స్టాండర్డ్‌ పుస్తకాలను మాత్రమే చదవాలని, సాధించాలనే పట్టుదల కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. రోజుకు కనీసం 8 గంటలపైన ఇష్టంగా చదవగలిగే సామర్థ్యం కలిగి ఉండాలన్నారు. కరెంట్‌ అఫైర్స్, ప్రసుత పరిణామాలను ఎప్పటికప్పుడు వాటిపై పట్టు సాధిస్తూ ఉండాలన్నారు. మొట్టమొదటగా సివిల్స్‌ సాధించాలనే విద్యార్థులు సాధించగలమనే కాన్ఫిడెంట్‌ ఉండాలన్నారు. ...

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.10 లక్షల గ్రాంట్‌ మంజూరు

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.10 లక్షల గ్రాంట్‌ మంజూరు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు న్యూఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ నుంచి రూ.10 లక్షల గ్రాంట్స్‌ మంజూరయ్యాయని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ సాయి అయ్యగారి ప్రతిపాదించిన‘‘ స్టడీస్‌ ఆన్‌ మాలిక్యులర్‌ ఫైలోజెనీస్‌ ఆఫ్‌ ఆంప్యుల్లారిడె అండ్‌ వీవిపారిడె ’’ అనే రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌కు యూజీసీ– బీఎస్‌ఆర్‌ –రీసెర్చ్‌ –స్టార్టప్‌ స్కీమ్‌ కింది యూజీసీ నుంచి అనుమతి లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి  ప్రాజెక్ట్‌కు అనుమతి పొందిన ఇద్దరు వ్యక్తులలో డాక్టర్‌ విజయ సాయి అయ్యగారి కూడా ఒక్కరన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంప్యుల్లారిడె అండ్‌ వీవిపారిడె ఫ్యామిలీస్‌కు చెందిన నత్తల యెక్క న్యూక్లియర్‌ అండ్‌ మైటోకాండ్రియల్‌ జెన్యూ సీక్వెన్స్‌ల ద్వారా   ఫైలోజెనిటిక్‌ ట్రీస్‌ను ఇన్‌ సిలికో టూల్స్‌ ద్వారా కనస్ట్రక్ట్‌ చేసి వాటి మధ్య అ...

విజ్ఞాన్స్‌లో ముగిసిన ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌

విజ్ఞాన్స్‌లో ముగిసిన ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 40 రోజుల పాటు జరిగిన ఉచిత విద్యావాలంటీర్స్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ముగిసిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవారయలు ఎంపీగా ఉన్న నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని బొల్లాపల్లి, మాచవరం, వెల్దర్తి మండలాలకు చెందిన 53 మంది గిరిజిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించామన్నారు. నేటితో శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న వీరందరూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారి సొంత గ్రామాల్లో విద్యా వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తూ నెలకు రూ.8000 వేతనం అందుకోనున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియంలో బలోపేతం చేయడానికి వీరు కృషి చేయాలన్నారు. అంతేకాకుండా మీ పరిసర గ్రామాల్లోని విద్యార్థులు డ్రాప్‌ అవుట్స్‌ అవ్వకుండా చూసుకోవాలన్నా...

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన ఐసీఎమ్‌ఎస్‌ఏ–22 అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన ఐసీఎమ్‌ఎస్‌ఏ–22 అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలోని సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డివిజన్‌ ఆఫ్‌ మేథమ్యాటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో  ‘‘ మేథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ (ఐసీఎమ్‌ఎస్‌ఏ–22)’’ అనే అంశంపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో ( ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌) నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో ముఖ్య అతిథిగా హాజరైన ఆస్ట్రేలియాలోని మెల్‌బౌర్న్‌ విక్టోరియా యూనివర్సిటీ ఐఎస్‌ఐఎల్‌సీ అండ్‌ డిజైన్‌ సైన్సెస్‌ అండ్‌ మోడలింగ్‌ ప్రోగ్రామ్‌ ప్రొఫెసర్‌ సర్దార్‌ ఎం.ఎన్‌. ఇస్లామ్‌ మాట్లాడుతూ మేథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్‌లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులు భవిష్యత్‌లో డేటాసైన్స్‌ను పరిశోధనాంశంగా ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని మల్టీ నేషనల్...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉత్సవ్‌

రూ.119 లక్షల స్కాలర్‌షిప్పుల పంపిణీ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉత్సవ్‌ ’ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.17.6 కోట్ల ఫీజురాయితీలు చదువులతోపాటు, ఆటలు, సాంస్కృతికాంశాల్లో ప్రతిభావంతులకు నగదు బహుమతులు యువతకు భారీ లక్ష్యాలు ఉండాలి: టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్, గ్లోబల్‌ ఆర్‌ఎంజీ హెడ్‌ ఈఎస్‌ చక్రవర్తి  ప్రత్యేక లక్షణాలుంటేనే జీవితంలో విజయం: మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ యువతకు భారీ లక్ష్యాలు ఉండాలని టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్, గ్లోబల్‌ ఆర్‌ఎంజీ హెడ్‌ ఈఎస్‌ చక్రవర్తి  తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ‘‘ఉత్సవ్‌’’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చదువులో ప్రతిభ చూపిన 233 మందికి రూ.119లక్షల విలువైన స్కాలర్‌షిప్పులు అందజేశారు. 15 క్రీడాంశాలు, 15 సాంస్కృతికాంశాల్లో విజేతలైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మొత్తం 233 మంది విద్యార్థులకు పలు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. చదువుల్లో ప్రతిభావంతులైన విద్యార్థులక...

ఎన్ఠీఆర్ శతజయంతి ఉత్సవాల్లో దర్శకుడు రత్నాకర్ కు సత్కారం

ఎన్ఠీఆర్  శతజయంతి ఉత్సవాల్లో దర్శకుడు రత్నాకర్ కు సత్కారం తెనాలి: శకపురుషుడు ఎన్ఠీఆర్ శతజయంతి మహోత్సవాల్లో భాగం గా మాజీ మంత్రి  ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరుగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలలో మంగళవారం *మన దేశం* చిత్రం  ప్రదర్శించారు. శత జయంతి సత్కారాల పండుగ* (రోజుకొక కళాకారునికి సత్కారం) కార్యక్రమంలో భాగంగా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్  తెనాలి డివిజన్ ప్రధాన కార్యదర్శి, సమాచార హక్కు సంఘం జిల్లా కార్యదర్శి, రచయిత, దర్శకుడు, కళా దర్శకుడు, వరల్డ్ రికార్డ్ హోల్డర్   కనపర్తి రత్నాకర్ ను శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు.  గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నాదుల మహేష్, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొబ్బిల్లపాటి ప్రసాద్ లు ఘనంగా సత్కరించి రత్నాకర్ కళా సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లవరపు విజయ్, కుదరవల్లి శ్ర...

విజ్ఞాన్స్‌లో విరాట పర్వం సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో విరాట పర్వం సినిమా యూనిట్‌ సందడి చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సోమవారం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో నిర్మించిన ‘‘ విరాట పర్వం’’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. రాణా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి హీరో హీరోయిన్లుగా,  వేణు ఉడుగుల  దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సురేష్‌ బొబ్బిలి, డైరక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ డాని సంచేజ్‌ లోఫెజ్, దివాకర్‌ మణి, ఎడిటర్‌గా శ్రీకర్‌ ప్రసాద్‌  పనిచేశారు. హీరో దగ్గుబాటి రాణా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విరాట పర్వం చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందన్నారు. సినిమాలో ఎమోషన్స్, డ్రామా, ఫైట్స్‌ తప్పకుండా అందరికీ నచ్చుతాయన్నారు. హీరోయిన్‌ సాయి పల్లవి మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే వైవిధ్యభరితమైనదని తెలియజేసారు. అనంతరం సినిమా యూనిట్‌ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.

విజ్ఞాన్‌ ప్రవేశపరీక్ష వీశాట్‌–2022 ఫేజ్‌–1 ఫలితాలు విడుదల

విజ్ఞాన్‌ ప్రవేశపరీక్ష వీశాట్‌–2022 ఫేజ్‌–1 ఫలితాలు విడుదల   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌   జూన్‌ 9 నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభం విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చరల్‌  ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్‌–2022 ఫేజ్‌–1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌)కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని విజ్ఞాన్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. వీశాట్‌–2022 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ వీశాట్‌–2022 ఫేజ్‌–1 ప్రవేశ పరీక్షను ఈ సంవత్సరం ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ ద్వారానే నిర్వహించామన్నారు. ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వీశాట్‌కు హాజరైనట్లు చెప్పారు. 90 శాతానికిపైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం, పరిశోధనల్లో సత్తా చాటుతుండటంలాంటì అరుదైన విజయాంశాల వల్లనే విద్యార్థులు, తల్లిదండ్రులకు తమ యూనివర్సిటీపై ఆదరణ మరింత పెరిగిందని సంతోషం వ్యక్తంచేశ...