విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.10 లక్షల గ్రాంట్‌ మంజూరు

విజ్ఞాన్స్‌ వర్సిటీకు రూ.10 లక్షల గ్రాంట్‌ మంజూరు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు న్యూఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ నుంచి రూ.10 లక్షల గ్రాంట్స్‌ మంజూరయ్యాయని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ సాయి అయ్యగారి ప్రతిపాదించిన‘‘ స్టడీస్‌ ఆన్‌ మాలిక్యులర్‌ ఫైలోజెనీస్‌ ఆఫ్‌ ఆంప్యుల్లారిడె అండ్‌ వీవిపారిడె ’’ అనే రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌కు యూజీసీ– బీఎస్‌ఆర్‌ –రీసెర్చ్‌ –స్టార్టప్‌ స్కీమ్‌ కింది యూజీసీ నుంచి అనుమతి లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి  ప్రాజెక్ట్‌కు అనుమతి పొందిన ఇద్దరు వ్యక్తులలో డాక్టర్‌ విజయ సాయి అయ్యగారి కూడా ఒక్కరన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంప్యుల్లారిడె అండ్‌ వీవిపారిడె ఫ్యామిలీస్‌కు చెందిన నత్తల యెక్క న్యూక్లియర్‌ అండ్‌ మైటోకాండ్రియల్‌ జెన్యూ సీక్వెన్స్‌ల ద్వారా   ఫైలోజెనిటిక్‌ ట్రీస్‌ను ఇన్‌ సిలికో టూల్స్‌ ద్వారా కనస్ట్రక్ట్‌ చేసి వాటి మధ్య అనుబంధాలను కనుక్కుంటారు. యూజీసీ నుంచి రూ.10 లక్షల గ్రాంట్‌ పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ సాయి అయ్యగారిని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ ప్రత్యేకంగా అభినందించారు.