విజ్ఞాన్స్‌ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు 100% ప్లేస్‌మెంట్స్‌

విజ్ఞాన్స్‌ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు 100% ప్లేస్‌మెంట్స్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అభ్యసించిన విద్యార్థులు 100% ప్లేస్‌మెంట్స్‌ సాధించారని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సును పూర్తిచేసిన మొదటి బ్యాచ్‌ విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులందరూ ఉద్యోగాలకే పరిమితం అవ్వకుండా ఇండస్ట్రీలోనే ఉంటారు కాబట్టి పరిశోధనల వైపు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ ప్రముఖ బహుళజాతి ఫార్మా కంపెనీలైన ఎంఎస్‌ఎన్‌ ల్యాబరేటరీస్, హెటిరో డ్రగ్స్, దివిసీ ల్యాబరేటరీస్, సింగ్రీన్‌ ఫార్మా, బైఫోర్‌ ఫార్మాస్యూటికల్స్‌కు ఎంపికయ్యారని వెల్లడించారు. మరికొంతమంది విద్యార్థులు ప్రముఖ టెక్నో స్కూల్స్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. విద్యార్థులను తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయకుండా ఆరు నెలల పాటు ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌కు కూడా పంపిస్తున్నామని తెలియజేసారు. ప్రముఖ బహుళజాతి ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు.