మహా దార్శనికుడు పి.విఘనంగా 101 వ జయంతి వేడుకలు

మహా దార్శనికుడు పి.వి

ఘనంగా 101 వ జయంతి వేడుకలు

పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ

పాత పోస్ట్ ఆఫీస్.. జూన్ 28..

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం 
కృషి చేయడంతో పాటు భూసంస్కరణలు అమలు చేసిన మహా దార్శనికుడు పీవీ నరసింహారావు అని పలువురు
ప్రముఖులు  కొనియాడారు.. పాతనగరంలోని వివేకానంద అనాధ, వృద్ధుల ఆశ్రమంలో మంగళవారం పీవీ నరసింహారావు 101 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పీవీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  సంఘ సేవకులు,, ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్  మాట్లాడుతూ
దేశం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పివి మెరుగైన పరిపాలన అందించారన్నారు, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి తన వంతు కృషి చేశారని , ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించిన ఘనత ఆయన సొంతం అన్నారు. దక్షిణ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 
ద్రోణము రాజు శ్రీ వాత్సవ మాట్లాడుతూ తమ తాత 
ద్రోనము రాజు సత్యనారాయణ  ద్వారా పీవీ నరసింహారావు ను కలుసుకోవడం తన జీవితంలో గొప్ప మధురానుభూతి గా పేర్కొన్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన పివి నేటి తరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు 
 సభాద్యక్షులు.. పీవీ చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు , అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు  మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా క్రమం తప్పకుండా పీవీ జయంతి, వర్ధంతి వేడుకలు ఈ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నామన్నారు,, త్వరలోనే  పలు సేవా కార్యక్రమాలు నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నామన్నా రు.
ట్రస్ట్ చైర్మన్ కె వి శర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తామని, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు,, తద్వారా నిరుపేదలకు సేవలు అందించాలన్నదే తన సంకల్పంగా పేర్కొన్నారు, తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,,
, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ నేటితరం పాలకులకు పివి ఆదర్శనీయుడన్నారు.
ఇప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు వల్ల ఎంతో మంది ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.
ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ పీవీ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
చేపట్టడం అభినందనీయమన్నారు.. తమను కూడా భాగస్వామిని చేసినందుకు సంస్థ నిర్వాహకులు కె వి శర్మ ను అభినందించారు.. ఈ సందర్భంగా నిరుపేదలకు, అన్నదానం వస్త్రదానం,
పుస్తకాలు వితరణ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ఈ కార్యక్రమంలో వైసిపి మహిళా నేత పీలా వెంకట లక్ష్మి, కమల్ బెఇడ్, రాఘవేంద్ర మిశ్రా, రాఘవేంద్ర మిశ్రా
సీనియర్ పాత్రికేయులు జాతీయ కార్యవర్గ సభ్యులు బ్రహ్మా నందం, జి శ్రీనివాసరావు,  పి రవిశంకర్
విశ్వేశ్వరరావు ఈశ్వరరావు తదితరులంతా పాల్గొనగా వివేకానంద సంస్థ అధ్యక్షులు
 సూరాడ అప్పారావుపలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.