నైపర్‌ జేఈఈ–2022లో సత్తాచాటిన విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు

నైపర్‌ జేఈఈ–2022లో సత్తాచాటిన విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు
నైపర్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) జేఈఈ–2022 జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి జాతీయస్థాయిలో సత్తాచాటారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళాశాలకు చెందిన జి.ఔచిత్య(304), బి.నాసరయ్య(878), ఎస్‌.శ్రీవల్లీ(1101), ఎన్‌.సుధాకర్‌ రెడ్డి (1537), ఈ.దుర్గా గాయత్రి‡(1987), ఎం.జాహ్నవి (2660), వి.అంక రాజేశ్వరి (2725), ఎన్‌.మేఘన (2980), ఆర్‌.సాయి కిరణ్‌ నాయక్‌ (3164) ర్యాంకులతో సత్తాచాటారని తెలియజేసారు. ఈ జాతీయస్థాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏఐసీటీఈ ప్రతి నెల రూ.12,400 స్కాలర్‌షిప్‌ లభిస్తుందని వెల్లడించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, కళాశాల జీప్యాట్‌ కమిటీ సభ్యులు, ఇతర అధ్యాపక సిబ్బంది అభినందించారు.