రంగస్థలం లోకి యువతకు ఆహ్వానం

రంగస్థలం లోకి యువతకు ఆహ్వానం...

శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న థియేటర్ యాక్టింగ్ వర్క్ షాప్ కి అడ్మిషన్స్ ప్రారంభం. థియేటర్ ఆర్ట్స్ లో యువతకు నైపుణ్యాన్ని, మెళకువలను నేర్పేందుకు శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారు 29వ మరియు 30వ థియేటర్ యాక్టింగ్ వర్క్ షాప్ లను 2022 జూన్ 20 నుండి ప్రారంభిస్తోంది.
2003 వ సం. నుండి ఇప్పటి వరకూ 28 వర్క్ షాప్ లను నిర్వహించి ఎంతోమంది నటీనటులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా రంగస్థల, టీవీ, సినీ రంగాలలో అవకాశాలు ఇప్పించిన శ్రీ జయా ఆర్ట్స్ ఇప్పుడు రెండు వర్క్ షాప్ లను ఒకేసారి నిర్వహిస్తోంది.
2022 జూన్ 20 నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు 
2022 జూన్ 25 నుండి శని ఆదివారాలలో వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది.
2022 జూన్ 18 శనివారం మరియు జూన్ 19 ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లమాకాన్ లో  ప్రముఖ సినీ నాటక రచయిత శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు రచించిన పద్మవ్యూహం నాటికను ప్రదర్శిస్తోంది. 
ఈ నాటిక ప్రదర్శనకు టికెట్ బుకింగ్ అలాగే వర్క్ షాప్ అడ్మిషన్స్ కోసం బుక్ మై షో  లేదా 9949910366 నెంబర్లలో సంప్రదించవచ్చు.