నటులుగా రాణించడానికి సరైన మార్గం రంగస్థలం

నటులుగా రాణించడానికి సరైన మార్గం రంగస్థలం 

- సినీ టీవీ నటి,దర్శకురాలు డా.శ్రీజ సాదినేని

లక్ష్యం ఉన్నతంగా ఉంటే సరిపోదు, అందుకు ప్రణాళిక కూడా సరిగ్గా వేసుకుంటేనే లక్ష్య సాధన సాధ్యం అవుతుంది అని ప్రముఖ సినీ నటి,రచయిత్రి,దర్శకురాలు డా శ్రీజ సాదినేని తెలిపారు.
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లమాకాన్ లో శనివారం రాత్రి శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ సమర్పణలో, డా.శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన  " పద్మవ్యూహం " నాటిక ప్రదర్శించారు.
ఈ సందర్భంగా డా.శ్రీజ మీడియాతో ముచ్చటించారు.ప్రముఖ సినీ రచయిత, నటులు, దర్శకులు శ్రీ ఎల్.బి.శ్రీరామ్ రచించిన పద్మవ్యూహం నాటిక సగటు మనిషి సమస్యల్ని కష్టాల్ని సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది. ఈ నాటికలో పది పాత్రలు ఉంటే వాటిని కేవలం ముగ్గురు ఆర్టిస్టులు మాత్రమే పోషించడం ఈ నాటిక ప్రత్యేకత అని డా.శ్రీజ అన్నారు.సినీ పరిశ్రమలో నటులుగా కొనసాగాలని ఎంతోమంది ఆశ పడుతుంటారని అయితే సరైన మార్గం తెలియక సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, సమయాన్ని,డబ్బుని వృధా చేసుకుంటున్నారని, అటువంటి వారు రంగస్థల నటనలో శిక్షణ తీసుకుంటే నటులుగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని  ఆమె అన్నారు.యువత రంగస్థలంలో తమ ప్రతిభా పాటవాలు మెరుగు పరుచుకుంటే సినీ టీవీ రంగాలలో కూడా రాణించే అవకాశం పుష్కలంగా ఉందని, అందుకు సరైన మార్గం రంగస్థలమే అని, అందుకే నటులుగా ఎదగాలని కోరుకునే యువతకు వర్క్ షాప్ లతో శిక్షణ ఇచ్చి, ఇలాంటి ప్రదర్శనలు ఇప్పించి, వారిని నటులుగా తీర్చి దిద్దుతున్నామని,జూన్ 20నుండి మరో యాక్టింగ్ వర్క్ షాప్ ప్రారంభిస్తున్నామని, ఆసక్తి కలిగిన వారు 9949910366 నెంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చు అని  డా.శ్రీజ సాదినేని యువతకు ఆహ్వానం పలికారు. 
ఈరోజు కూడా పద్మవ్యూహం నాటిక ప్రదర్శన లమాకాన్ లో ప్రదర్శిస్తున్నామని, నాటక, కళా ప్రియులు అందరూ వచ్చి తమ కళాకారులను ఆశీర్వదించాలని డా.శ్రీజ కోరారు.