జర్నలిస్టుల సమస్యలపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన

జర్నలిస్టుల సమస్యలపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన
విశాఖపట్నం, జూన్ 27, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్లు సంయుక్తంగా సోమవారం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, వృత్తి పన్ను రద్దు చేయాలని,ఇళ్ల స్థలాలు కేటాయించాలని,విశాఖపట్నంలో 1996 మరియు 2009లో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల సమస్యను సత్వరం పరిష్కరించాలని,మీడియా అకాడమీ ఏర్పాటు చేయాలని, పెన్షన్ పథకం,ఆరోగ్య భీమా అమలు చేయాలని, జర్నలిస్టులకు అవార్డులు ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ గత మూడు ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని,అక్రిడేషన్లు విషయంలో అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తపరిచారు.ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కొత్తగా వృత్తి పన్ను ప్రతి జర్నలిస్టు 2500 రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. చాలీచాలని జీతాలు,అంతంతమాత్రంగా ఉన్న ఉద్యోగాలతో కాలం గడుపుతున్న జర్నలిస్టులు వృత్తి పన్ను చెల్లింపు దుర్లభమని అన్నారు.జాతీయ జర్నలిస్టుల సంఘం  కార్యదర్శి గంట్ల శ్రీనువ్
బాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఆరోగ్య బీమా ఇళ్ల స్థలాలు కేటాయించాలని వృత్తి పన్ను మినహాయించాలని కోరారు,ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 
మహా విశాఖ నగర శాఖ అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్,కార్యదర్శి ఎస్  అనురాధ, బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు,ఇతర నాయకులు శివ ప్రసాద్, జి. శ్రీనివాసరావు,దాడి రవికుమార్, వై. రామకృష్ణ,ఎన్.రామకృష్ణ, ఎమ్మెస్సార్ ప్రసాద్,చింతా ప్రభాకరరావు,ఎం.ఎ. ఎన్. పాత్రుడు,శివరాం, కె. వి. శర్మ,,నగేష్ ఎన్. బ్రహ్మానందం, సుధాకర్ , కామన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ కు వినతిపత్రం సమర్పించారు.