ఎన్ఠీఆర్ శతజయంతి ఉత్సవాల్లో దర్శకుడు రత్నాకర్ కు సత్కారం

ఎన్ఠీఆర్  శతజయంతి ఉత్సవాల్లో దర్శకుడు రత్నాకర్ కు సత్కారం

తెనాలి: శకపురుషుడు ఎన్ఠీఆర్ శతజయంతి మహోత్సవాల్లో భాగం గా మాజీ మంత్రి  ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరుగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలలో మంగళవారం *మన దేశం* చిత్రం  ప్రదర్శించారు. శత జయంతి సత్కారాల పండుగ* (రోజుకొక కళాకారునికి సత్కారం) కార్యక్రమంలో భాగంగా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్  తెనాలి డివిజన్ ప్రధాన కార్యదర్శి, సమాచార హక్కు సంఘం జిల్లా కార్యదర్శి, రచయిత, దర్శకుడు, కళా దర్శకుడు, వరల్డ్ రికార్డ్ హోల్డర్   కనపర్తి రత్నాకర్ ను శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు.  గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నాదుల మహేష్, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొబ్బిల్లపాటి ప్రసాద్ లు ఘనంగా సత్కరించి రత్నాకర్ కళా సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లవరపు విజయ్, కుదరవల్లి శ్రీనివాస్, పెమ్మసాని పోతురాజు, పెసరలంక గోపి, మునిపల్లి శ్రీకాంత్, ఎన్టీఆర్ జగన్, మాలకొండమ రాజు, ముప్పానేని రాఘవరావు, నల్లూరి శ్రీనివాస్, డా.అయినాలమల్లేశ్వరరావు, కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్ మాస్టర్, నటుడు, న్యాయవాది కనపర్తి మధుకర్,  దేవరపల్లి భవాని,  పెసర్లంక గోపి, రమేష్ పాత్రికేయులు టి. రవీంద్ర, జీ. ప్రకాశరావు, ప్రేమ్ కుమార్, పి. పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో బుధవారం పల్లెటూరు చిత్ర ప్రదర్శనవుంటుందన్నారు.