విజ్ఞాన్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో గురువారం విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య 71వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు మాత్రమే తారతమ్య భేధాలు లేకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారని అన్నారు. విద్యార్థులందరూ జీవితంలో బాగా ఎదిగి మంచి లీడర్లు అయినప్పుడు తాను ఇంకా ఎక్కువ సంతోషిస్తామని తెలియజేశారు. విద్యార్థులతో తనకున్న అనుబం«ధం మాటల్లో వర్ణించలేనిదని, అందుకోసమే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును విద్యార్థుల మధ్య జరుపుకోవడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. సాధారణ ఆలోచనలతో కాకుండా క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే విజయం సాధించగలరని విద్యార్థులకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విద్యార్థులు సరైన దిశగా ఎదగలగరనే సిద్ధాంతాన్ని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని చెప్పారు. అదే సూత్రాన్ని తాము ప్రతి పాఠశాల, కళాశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. కాబట్టే తమ విద్యార్థులు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నారని పేర్కొన్నా...