8 నుంచి విజ్ఞాన్స్‌లో జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–22

8 నుంచి విజ్ఞాన్స్‌లో జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–22

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 8 నుంచి రెండు రోజుల పాటు జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘‘రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22’’ బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్, చెన్నై రీజియన్‌లోని సీఎస్‌ఐ స్టూడెంట్‌ చాప్టర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ఎక్స్‌చేంజింగ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఐడియాస్‌ ఫర్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు  కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ, ఐఐటీ మండి ఫౌండర్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ తిమోథీ ఏ.గాన్‌సాల్వ్స్, ఐఐటీ మద్రాస్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ సీ.చంద్రశేఖర్, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ డీ.ఎస్‌.గురు, ఫిలిప్స్‌ రీసెర్చ్‌ సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌.దినేష్, కోయంబత్తూర్‌లోని ఆంఫి వెంచర్స్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్, ఇంకా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్‌లు కూడా ఈ కాన్‌క్లేవ్‌కు హాజరవుతున్నారని తెలియజేసారు.