సరైన గురువుల శిక్షణ వల్లే స్వర్ణ పతకం దక్కింది

సరైన గురువుల శిక్షణ వల్లే స్వర్ణ పతకం 
- సినీ టీవీ నటి, రచయిత్రి డా.శ్రీజ సాదినేని

హైదరాబాద్: గురువులు దొరికితే స్వర్ణ పతకం మాత్రమే కాదు ఏదైనా సాధించ వచ్చు అన్నారు సినీ టీవీ నటి, రచయిత్రి డా శ్రీజ సాదినేని.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన 15వ స్నాతకోత్సవంలో 2017-19 సం.కి గానూ రంగస్థల కళల శాఖలో గోల్డ్ మెడల్ అందుకున్న సందర్భంగా డా శ్రీజ మీడియాతో ముచ్చటించారు. 
ద్రోణాచార్యుడి వంటి గురువు వల్లనే అర్జునుడు గొప్ప విలుకాడుగా పేరు గాంచాడు. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. మంచి గురువు దొరికితే విద్య నేర్చుకోవాలి అనుకునే ప్రతి విద్యార్థీ  అత్యున్నత శిఖరాలను అందుకుంటారన్నారు.
అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో డా.పద్మప్రియ, డా.కోట్ల హనుమంతరావు, కళ్యాణి,
ణి, మల్లాది గోపాలకృష్ణ, రాయల హరిశ్చంద్ర,, ఆంటోనీ రాజ్ వంటి మంచి మంచి గురువులు ఉండబట్టే  థియరీ, ప్రాక్టికల్స్ అన్నిట్లోనూ ఉత్తీర్ణత సాధించి స్వర్ణ పతకం పొందగలిగానని తన గురువులకు పాదాభివందనాలతెలుపుకుంటున్నాను అని తన గురుభక్తిని చాటుకున్నారు.
యాక్టింగ్,యాంకరింగ్,న్యూస్ రీడింగ్, డబ్బింగ్,స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ వంటి కోర్సులలో తాను కూడా వెయ్యిమందికి పైగా శిష్యులకు  శిక్షణ ఇచ్చినా తమ గురువులను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని తమ శిష్యుల అభ్యున్నతిని కోరుకునే గురువులు దొరికితే ఎవరూ వదులుకో వద్దని తెలిపారు. 
నాటకరంగం నుండి సినీ రంగంలో రచయితగా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నానని, అతిత్వరలో మంచి ప్రాజెక్టుతో వెండి తెరపైకి వెళ్లనున్నట్లు తన భవిష్యత్ ప్రణాళికను గురించి డా.శ్రీజ తెలియజేశారు. ఈ సందర్భంగా తనను అభినందించిన ప్రముఖులకు అందరికీ ధన్యవాదములు తెలిపారు.