విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయి పేటెంట్‌ మంజూరయ్యిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని కేఆర్‌ మంగళం యూనివర్సిటీ ప్రో వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ అవిరేని శ్రీనివాసులు, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ ముసల శారదల సంయుక్త గైడ్‌ల ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పోసాని విజయలక్ష్మి ప్రతిపాదించిన ‘‘ ఏ నావల్‌ హై స్పీడ్‌ లో పవర్‌ త్రీ ఇన్‌పుట్‌ స్టాటిక్‌ సీఎమ్‌వోఎస్‌ ఎక్స్‌క్లూజివ్‌– ఆర్‌ లాజిక్‌ గేట్‌ సర్కూట్‌’’ అనే అంశానికి ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. వీరు ప్రతిపాదించిన ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ను బేసిక్‌ ఎలిమెంట్‌గా వినియోగించి అతి తక్కువ స్పేస్, పవర్‌ గల హైస్పీడ్‌ ప్రాససర్‌లను తయారుచేయచ్చు. వీళ్లకు ఈ పేటెంట్‌పై 20 సంవత్సరాల పాటు హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పేటెంట్‌ పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పోసాని విజయలక్ష్మి, ప్రొఫెసర్‌ ముసల శారదలను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు.