విజ్ఞాన్ ఫార్మసీలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించినట్లు విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విజ్ఞాన్స్ ఫార్మసీ కళాశాల, వీ కాన్ఫిగర్ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంయుక్త సహకారంతో ‘‘ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ క్లినికల్ రీసెర్చ్ విత్ సాస్ ప్రోగ్రామింగ్’ అనే అంశంపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఎస్‌ఏలోని బేయర్ ఫార్మాస్యూటికల్స్ డేటా సైంటిస్ట్ వెంకట్ ఇక్కుర్తి మాట్లాడుతూ క్లినికల్ రీసెర్చ్‌లో సాస్ ప్రోగ్రామింగ్‌ను ఉపయోగించి అనలిటికల్ రిపోర్ట్స్‌ను జనరేట్ చేయవచ్చునని, దీని వలన ఖర్చు, మానవ వనరులు ఆదా అవుతాయని విద్యార్థులకు తెలియజేసారు. వీటితో పాటు ఖచ్చితమైన రిపోర్ట్స్‌ను పొందవచ్చునన్నారు. ఫార్మారంగంలో విద్యార్థులకు మంచి అవకాశులున్నాయని.. విద్యార్థులు కష్టపడి చదివి క్లినికల్ ఫార్మాసిస్ట్‌లుగా, పారిశ్రామిక రంగంలో శాస్త్రవేత్తలుగా, విద్యావేత్తలుగా ఎదిగి తమ కల...