విజ్ఞాన్స్‌ విద్యార్థికి షూటింగ్‌లో 3 సిల్వర్‌ మెడల్స్‌

విజ్ఞాన్స్‌ విద్యార్థికి షూటింగ్‌లో 3 సిల్వర్‌ మెడల్స్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన రెండో సంవత్సరం బీబీఏ విద్యార్థి డాకా యశ్వంత్‌ రెడ్డికి రాష్ట్రస్థాయిలో మూడు సిల్వర్‌ మెడల్స్‌ సాధించాడని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సిల్వర్‌ మెడల్స్‌ సాధించిన విద్యార్థికి ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన ‘‘22వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ కాంపిటీషన్స్‌ ఇన్‌ ఎయిర్, స్మాల్‌ బోర్, షాట్‌గన్‌ ఈవెంట్స్‌–2022లో తమ విద్యార్థి సత్తాచాటాడి తెలియజేసారు. ఈ షూటింగ్‌ పోటీలను హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ నిర్వహించిందని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీకు చెందిన రెండో సంవత్సరం బీబీఏ విద్యార్థి డాకా యశ్వంత్‌ రెడ్డి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 377 పాయింట్లతో యూత్, జూనియర్, సీనియర్‌ విభాగాల్లో కలిపి 3 సిల్వర్‌ మెడల్స్‌ సాధించాడని తెలియజేసారు. ఈ కాంపిటీషన్‌లో సిల్వర్‌ మెడల్స్‌ సాధించడం వలన వచ్చే నెలలో తమిళనాడులో జరగనున్న సౌత్‌జోన్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు. మెడల్స్‌ సాధించిన విద్యార్థిని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, యూనివర్సిటీ ఫిజకల్‌ డైరక్లర్లు, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు.