విజ్ఞాన్స్‌లో అబెట్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం

విజ్ఞాన్స్‌లో అబెట్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఐక్యూఏసీ ఆధ్వర్యంలో అబెట్‌( అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై శుక్రవారం అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడులోని కళసలింగం యూనివర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ శశి ఆనంద్‌ శ్రీధరణ్‌ మాట్లాడుతూ అబెట్‌ అక్రిడిటేషన్‌ ఉన్న యూనివర్సిటీలకు ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో పాటు కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు బాగా మెరుగుతాయని తెలియజేసారు. వీటితో పాటు విదేశాలలో ఉన్న యూనివర్సిటీలతో విద్యార్థులకు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్, ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్స్, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. అయితే అబెట్‌ అక్రిడిటేషన్‌ సాధించాలనుకునే యూనివర్సిటీలకు ఉండాల్సిన కనీస అర్హతలు తెలియజేసారు. అబెట్‌ అక్రిడిటేషన్‌ను కేవలం యూనివర్సిటీలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న బ్రాంచ్‌లకు మాత్రమే అందజేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఐక్యూఏసీ సిబ్బంది, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.