వీఐపీ కల్చర్‌ను డెవలప్‌ చేసుకోవాలి

వీఐపీ కల్చర్‌ను డెవలప్‌ చేసుకోవాల
- జూపూడి హైమావతి

 విజ్ఞాన్‌లో ఘనంగా 75వ స్వాతంత్య్ర ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకులు

విద్యార్థులు వీఐపీ( విజన్, ఇన్నోవేషన్, పర్‌ఫెక్షన్‌) కల్చర్‌ను డెవలప్‌ చేసుకోవాలని శ్రీమతి జూపూడి హైమావతి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి జూపూడి హైమావతి మాట్లాడుతూ  విద్యార్థులు యంగ్‌ ఇండియాను నిర్మించాలని కోరారు. ప్రతి విద్యార్థి నేషనలిజంను పెంపొందుకోవాలని సూచించారు. విద్యార్థుల వినూత్నంగా ఆలోచిస్తే సరికొత్త ఆవిష్కరణలను సృష్టించవచ్చునన్నారు. మదర్‌ ఇండియా ఈ స్థాయికి ఎదగడానికి 75 సంవత్సరాల పాటు కష్టపడాల్సి వచ్చిందన్నారు. దేశ అభివృద్ధికి మీరేం చేయగలరో ఆలోచించండని, మనం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందినట్లే అని తెలిపారు. విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ మహాత్ముడు పాటించిన సత్యం, అహింసను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు అందరూ ఎప్పుడూ పాజిటవ్‌ మైండ్‌తో ఉండాలని సూచించారు.  ఏదైనా ఒక పనిచేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి... శాంతియుత మార్గంలోనే నడవాలన్నారు. ఈ సందర్భంగా పలు యుద్ధాల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళిగా ఏర్పాటు చేసిన అమర్‌ జవాన్‌ స్థూపానికి నివాళులర్పించి జ్యోతి వెలిగించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్విజ్‌లు, డిబేట్‌లు వంటి కార్యక్రమాలను నిర్వహించారు.