విజ్ఞాన్స్‌లో న్యాక్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం

విజ్ఞాన్స్‌లో న్యాక్‌ అక్రిడిటేషన్‌ ప్రాసెస్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ‘‘ బ్రెయిన్‌స్టార్మింగ్‌ సెషన్‌ ఆన్‌ రివైజ్డ్‌ అక్రిడిటేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఆఫ్‌ న్యాక్‌ ( అఫ్లియేటెడ్‌ అండ్‌ అటానమస్‌) ఫర్‌ హెచ్‌ఈఐఎస్‌’’ అనే అంశంపై మహారాష్ట్ర రాష్ట్రం పూణె సమీపంలోని బరామతిలో ఉన్న విద్యా ప్రతిస్థాన్స్‌ విద్యాసంస్థల ప్రతినిధులకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించామని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం బుధవారం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీన్‌ ఐక్యూఏసీ డాక్టర్‌ ఎం.రామక్రిష్ణæ మాట్లాడుతూ న్యాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలనే యూనివర్సిటీలు ఎప్పటికప్పడు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో పాటు కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సాధించాలని పేర్కొన్నారు. కరికులర్‌ ఆస్పెక్ట్స్, టీచింగ్‌–లెర్నింగ్‌ అండ్‌ ఎవాల్యూషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్‌ కేటగిరీల్లో యూనివర్సిటీ ముందంజలో ఉండాలన్నారు. వీటితో పాటు స్టూడెంట్స్‌ సపోర్ట్‌ అండ్‌ ప్రోగ్రెస్సన్, గవర్నెనెన్స్, లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఇనిస్టిట్యూషన్‌ వాల్యూస్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌లో సత్తాచాటాలన్నారు. అఫ్లియేటెడ్‌ అండ్‌ అటానమస్‌ కాలేజీలు న్యాక్‌ అక్రిడిటేషన్‌ సాధించనట్లైతే విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు బాగా మెరుగుతాయని తెలియజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఐక్యూఏసీ సిబ్బంది పాల్గొన్నారు.