చేనేతలకు సీఎం జగన్ చేయూత

చేనేతలకు సీఎం జగన్ చేయూత


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:

సీఎం జగన్ సంక్షేమ ప్రభుత్వంలో మరో మైలు రాయి. రాష్టంలోని చేనేతల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో భాగంగా నాలుగో ఏడాది నిధులను సీఎం జగన్ గురువారం నాడు విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80,546 మంది నేత కార్మికులకు డీబీటీ ద్వారా రూ. 24,000 వారి ఖాతాల్లోకి విడుదల చేశారు. దేశ స్వాతంత్ర పోరాట సమయంలో నేత కార్మికుల సహకారం అందరినీ చైతన్యవంతం చేసి ఐక్యంగా ఉంచిందని పెడనలో నిర్వహించిన చేనేత భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ పేర్కొన్నారు.

పాదయాత్రలో చేనేతల కష్టాన్ని చూసి తన  హృదయాన్ని కలచివేసిందన్నారు. అందుకోసం నేను వారికి "నేను ఉన్నాను నేను విన్నాను" అని మాట ఇచ్చాను. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నా పుట్టిన రోజున ఈ పథకాన్ని ప్రారంభించాను.

ఇప్పటి వరకు ‘నేతన్న నేస్తం’ కింద రూ.776 కోట్లు, పెన్షన్ కింద రూ.879 కోట్లు, ఆప్కో ద్వారా రూ.393 కోట్లు ఇలా మొత్తం రూ.2049 కోట్లను పంపిణీ చేశాం. అమెజాన్, మింత్ర, ఫ్లిపకర్ట్, గొకూప్, లూంఫోక్స్, మిరావ్, పేటియం వంటి ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ ద్వారా ఆప్కో వస్త్రాలను అమ్మకాలను ప్రోత్సహించేలా ఒప్పందం కుదుర్చుకున్నాం.