ఏపీలో ప్లాస్టిక్ ప్లెక్సీలు బ్యాన్

ఏపీలో ప్లాస్టిక్ ప్లెక్సీలు బ్యాన్
- సీఎం జగన్
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
వైజాగ్ బీచ్ క్లీనింగ్‌లో ఏపీ ప్రపంచ రికార్డు

పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక పురోగతి సాధ్యం

రాష్ర్టంలో పర్యావరణ పరిరక్షణ కోసం 2 బిలియన్ల పెట్టుబడులు తెచ్చేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు

ఏపీలో పార్లే ఫర్ ఓషన్స్ నూతన హబ్ ద్వారా కొత్తగా 20 వేల మంది యువతకు ఉపాధి

ఏపీకి దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతాన్ని ఉండటం ఓ వరం
వైజాగ్ బీచ్ పరిరక్షణ కోసం శుక్రవారం నాడు 40 ప్రాంతాల్లో 22 వేల మంది పాల్గొని 76 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. పర్యావరణ పరిరక్షణలో ఇదో ప్రపంచ రికార్డు

ఏపీ కేంద్రంగా ప్రపంచంలో ప్లాస్టిక్ కాలుష్యం అరికట్టడం పై పార్లే ఫర్ ఓషన్ సంస్థ పనిచేయడం రాష్ర్టానికి ఓ సదవకాశం.

పర్యావరణ పరిరఖణ కోసం ప్రభుత్వం క్లాప్ (CLAP) కార్యక్రమం ద్వారా 4,097 చెత్త సేకరించే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.

క్లాప్ (CLAP) పథకం కింద గ్రామీణ చెత్త సేకరణ రేటు 22 నుండి 62%కి పెరిగింది. 100% సాధించడమే ప్రభుత్వ లక్ష్యం.

ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చాం.

2027 నాటికి ఏపీని కూడా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం.

పర్యావరణ, సముద్ర పర్యావరణ పరిర ఖణ కోసం 20,000 మంది సముద్ర యోధులను తీర్చిదిద్దుతాం.