డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీలో ఏపీ నెం. 1

*డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీలో ఏపీ నెం. 1*

*ఎకనైమిక్ టైమ్స్ ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రానికి మొదటి స్థానం*


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
• దేశంలో హెల్త్ కార్డ్‌ల డిజిటలైజేషన్ & ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రగామిగా నిలిచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎకనామిక్ టైమ్స్ అవార్డు

• "డిజిటెక్ కాంక్లేవ్ 2022" కార్యక్రమంలో అవార్డు అందుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని

• రాష్ట్రంలో 2019 నుంచి QR కోడ్‌లతో కూడిన 1.4 కోట్ల స్మార్ట్ హెల్త్ కార్డ్‌లు పంపిణీ

• రేషన్ కార్డు కలిగిన అన్ని కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డ్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వం

• 2 వేలకు పైగా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డ్ పెషేంట్లకు ఉచితంగా చికిత్స

• గత ఏడాదిలో రూ. 2,054 కోట్లతో 6.2 లక్షల మంది రోగులకు ప్రయోజనం

• రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు & చెన్నై నగరాల్లోని ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్సలు