చెడుపై విజయానికి ప్రతీక అమ్మవారు విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య వర్సిటీలో వైభవంగా నవరాత్రి వేడుకలు చెడుపై విజయానికి ప్రతీక అమ్మవారు అని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజున యూనివర్సిటీలో అమ్మవారిని అన్నపూర్ణ దేవి రూపంలో అలంకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ నవరాత్రుల్లో ఐదవరోజు చాలా విశేషమైనదన్నారు. అందరికీ అన్నంపెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారన్నారు. అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఎప్పుడు ఆహారానికి ఇబ్బంది ఉండదని, అమ్మను కొలిచిన వారి గృహం సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. నవరాత్రి అంటే కేవలం తొమ్మిది రోజులు చేసుకునే ఉత్సవం కాదని... స్త్రీతత్వం తాలూకు మూడు పరిమాణాలైన దుర్గ, లక్ష్మి, సరస్వతిగా కొలిచే ఉత్సవమన్నారు. అమ్మవారిని...