Skip to main content

ఏపీ టూరిజంలో రూ. 550 కోట్ల పెట్టుబడులు


ఏపీ టూరిజంలో రూ. 550 కోట్ల పెట్టుబడులు

*ఏపీటీడీసీ ప్రాజెక్టులపై 11 గ్లోబల్ కంపెనీల ఆసక్తి
*రీ క్రియేషన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ లోని టూరిజం ప్రాజెక్టుల్లో పెట్టబడులు పెట్టేందుకు 11 గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపినట్లు ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. వవిధ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ. 550 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు వివరించారు. టూరిజం పాలసీలో భాగంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను రిక్రియేషన్ హబ్‌ ప్రాజెక్టులను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. లండన్‌లో జరిగిన *యూరప్ ఎక్స్‌పో 2022* లో ఏపీటీడీసీ తరుపున పాల్గొన్న వరప్రసాద్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యూరప్ ఎక్స్ పోలో ప్రత్యేకంగా రాష్ర్టంలోని పర్యాటక ప్రాజెక్టులు, పెట్టుబడుల అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించినట్లు తెలిపారు. పర్యాటక రంగంలో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న  అవకాశాలను చూసి 11 గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించినట్లు వివరించారు.  


*ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన కంపెనీలు*.

- స్విట్జర్లాండ్ కు చెందిన  ఇంటమిన్ వరల్ట్  వైడ్ కంపెనీ. ఇది ప్రపంచంలోనే ప్రముఖ వినోద అమ్యూస్ మెంట్ రైడ్స్, మోనో రైల్స్ తయారీదారుల్లో ఒకటి. ఈ కంపెనీ ప్రతినిధులతో తిరుపతిలో మోనోరైల్ ప్రాజెక్ట్ గురించి చర్చించడంతో పాటు, జాయింట్ వెంచర్‌గా రూ. 100 కోట్లతో విశాఖపట్నంలోని స్కై టవర్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శరించింది.
- టర్కీకి చెందిన పోలిన్ గ్రూప్ రూ. 100 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం ప్రాజెక్ట్‌ ను చేపట్టనుంది.
- జర్మనీ చెందిన హస్ పార్క్ అట్రాక్షన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సంస్థ రాష్ర్టంలోని వినోదం, ఉద్యానవన పార్కులకు చెందిన పలు ప్రాజెక్టులను చేపట్టనుంది.
- కెనడాకు చెందిన ఎరోడియం కంపెనీ గండికోటలో స్కై-డైవింగ్ ప్రాజెక్ట్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపింది.
- అరకు లోయలో ఒకేసారి 30 మందిని తీసుకువెళ్లగలిగే సామర్థ్యం కలిగిన టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్ట్ లో  ఫ్రాన్స్‌కు చెందిన ఏరో ఫైల్ కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. 
- ఇటలీకి చెందిన నీవి ప్లాస్ట్ శీతాకాలపు క్రీడా పరికరాల ఉత్పత్తి, సరఫరాకు ఆసక్తి చూపింది.
- ఎక్స్‌ట్రీ వెంచర్స్ ఆఫ్ ఫ్రాన్స్ భారీ పెట్టుబడులతో రాష్ర్టంలో ప్రపంచ స్థాయి అడ్వెంచర్ పార్క్‌పై ఆసక్తి వ్యక్తం చేసింది.
- హై-ఎండ్ మీడియా ఆధారిత సిమ్యులేటర్ల విభాగంలో ఫ్లయింగ్ థియేటర్లు, డోమ్ థియేటర్లను నిర్మించడానికి టర్కీకి చెందిన డోఫ్ కంపెనీ ఆమోదం తెలిపింది.
- కెనడాకు చెందిన వైట్ వాటర్ వెస్ట్ కంపెనీ భారీ వాటర్ పార్క్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.
- స్విట్జర్లాండ్‌కు చెందిన మరో కంపెనీ తన పెట్టుబడులను కైలాసగిరి కొండపై ఉన్న తెలుగు మ్యూజియంతో పాటు  'ఆకర్షణ!' సహా విశాఖపట్నంలోని వివిధ ప్రాజెక్టులపై ఆసక్తి కనబరిచింది.
- ఫ్రాన్స్‌కు చెందిన కాన్సెప్ట్ 1900, న్యూజిలాండ్‌కు చెందిన డెల్టా స్ట్రైక్ వంటి ఇతర కంపెనీలు రాష్ర్టంలోని పర్యాటక అభివృద్ధి ప్రణాళికల్లో భాగం కావడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...