విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పుల్లగూర జాషువా రెజినాల్డ్‌కు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం శనివారం తెలిపింది. ‘‘డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఎఫిసియంట్‌ అండ్‌ రిలయబుల్‌ ప్రోటోకాల్స్‌ ఫర్‌ మొబైల్‌ అడహక్‌ నెట్‌వర్క్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసింది.  ఈయనకు విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ విభాగాధిపతి, ప్రొఫెసర్‌ ధూళిపాళ్ల వెంకటరావు  గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. మిలిటరీ అప్లికేషన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలలో ఎటువంటి మౌళిక సదుపాయాలు పనిచేయనప్పుడు ఈయన రూపొందించిన ప్రోటోకాల్స్‌ ఎంతగానో ఉపయోగపడుతాయని తెలియజేసింది. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 15 స్కూపస్‌ జర్నల్‌ పేపర్లు, 5 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని వెల్లడించింది. పీహెచ్‌డీ పట్టాపొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పుల్లగూర జాషువా రెజినాల్డ్‌ను వర్సిటీ రిజిస్ట్రార్‌  డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.