విజ్ఞాన్స్‌ వర్సిటీ ఆధ్వర్యంలో శలపాడులో హెల్త్‌ క్యాంప్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీ ఆధ్వర్యంలో శలపాడులో హెల్త్‌ క్యాంప్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ ఆధ్వర్యంలో యూనివర్సిటీ దత్తగ్రామాలైన శలపాడు, వేజండ్ల గ్రామాల్లో పలు సేవాకార్యక్రమాలతో పాటు హెల్త్‌ క్యాంప్‌లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శలపాడు, వేజండ్ల గ్రామాల్లో హెల్త్‌ క్యాంప్‌తో పాటు గ్రామస్తులకు ఆరోగ్యం– పరిసరాల పరిశుభ్రత మీద ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు అవగాహన కల్పించారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన కరపత్రాలను అందించి గడప గడపకు తెలియజేసారు. హెల్త్‌ క్యాంప్‌ ద్వారా అవసరమైన మందులు, ఉచిత చెకప్‌లు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రోడ్లను ఊడ్చడంతోపాటు చెత్తాచెదారాన్ని తొలగించారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు. శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు. పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల శారీరక శ్రమతోపాటు పదిమందికి మంచి పనిచేసినట్లవుతుందని వెల్లడించారు.