డీబిటీతో ఏపీలో ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి

డీబిటీతో ఏపీలో ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి

 -అసెంబ్లీలో సీఎం జగన్
*పిరమిడ్ ఆర్థిక వ్యవస్థతో సానుకూల వృద్ధి రేటు సాధించాం*.

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల అమల్లో భాగంగా డీబీటీ పద్ధతిలో నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశాం. దీంతో మార్కెట్లో డిమాండ్, సప్లై సమానంగా ఉంటూ వృద్ధి చెందాయి. సుస్థిర ఆర్థిక వృద్ధి సాధించడంలో 30 ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ఏపీ GSDP నమోదులో సానుకూల వృద్ధిని సాధించింది. దేశంలోని 4 రాష్ట్రాల్లో మాత్రమే సానుకూల GSDP వృద్ధి రేటు సాధ్యమైంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత ఇది. కోవిడ్ విపత్తులో కూడా ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకున్నాం. GSDPలో అత్యధిక వృద్ధి రేటు నమోదు కావడానికి కారణం పరిపాలన, సంక్షేమ పథకాలను డీబీటీ ద్వారా క్రింది స్థాయిలో ప్రజలకు ఖచ్చితంగా అమలుచేయడమే.