జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
- జర్నలిస్టుల కోర్కెల దినోత్సవంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్
తెనాలి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్రనాయకత్వం పిలుపు మేరకు సోమవారం కోర్కెల దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాకు జర్నలిస్టుల  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఫెడరేషన్ నాయకులు అందజేసారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవికుమార్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుందని ఫలితంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. అర్హతగల ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరుచేయాలన్నారు. అదేవిదంగా జర్నలిస్టులకు భీమా, ఆరోగ్య కార్డులు చెల్లుబాటులో ఉండేవిదంగా చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా కమీషన్ ను ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. అక్రిడిటేషన్ కమిటీల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ను భాగస్వామ్యంచేయాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలను కేటాయించి గృహ నిర్మాణాలను చేపట్టాలన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ ఫెడరేషన్ తెనాలి డివిజన్ కోర్కెమేరకు శాసన సభ్యులు తెనాలి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేసారు. త్వరలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసి తెనాలి ప్రాంత జర్నలిస్టుల చిరకాల వాంఛను తీర్చాలని తెనాలి ప్రత్యేకతను పట్టంకట్టాలన్నారు. ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ విషయంలో దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి డి. కోటేశ్వరరావు, తెనాలి నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి శ్యామ్ సాగర్, పుట్ల పున్నయ్య, నాయకులు టి. రవీంద్రబాబు, ఎస్.ఎస్. జహీర్, బచ్చు సురేష్ బాబు, జి. ప్రకాశరావు, జి. ప్రేమకుమార్, శ్రీకాంత్, వి. లక్ష్మణరావు, శామ్యూల్, ఎ. సాంబశివరావు, శేషిరెడ్డి, సుబ్బారావు చంద్రమోహన్, ఎం. ప్రసాద్, రవికిరణ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ హకీం జానీ తదితరులు పాల్గొన్నారు.