భూమిని కాపాడుకోవాలి

భూమిని కాపాడుకోవాలి


హైదరాబాద్‌లోని ఇక్రిసాట్‌– ఇన్నోవేషన్‌ సిస్టమ్స్‌ ఫర్‌ డ్రైలాండ్స్‌ హానరరీ ఫెల్లో, మాజీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ కే.పూర్ణ చంద్రరావ్‌

ప్రపంచ మానవాళి నుంచి విడుదలవుతున్న వివిధ రకాల కాలుష్యాల నుంచి భూమిని కాపాడుకోవాలని హైదరాబాద్‌లోని ఇక్రిసాట్‌– ఇన్నోవేషన్‌ సిస్టమ్స్‌ ఫర్‌ డ్రైలాండ్స్‌ హానరరీ ఫెల్లో, మాజీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ కే.పూర్ణ చంద్రరావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో ‘‘ సేవ్‌ సాయిల్‌ ’’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  మాజీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ కే.పూర్ణ చంద్రరావ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం భూమిని మూడు రకాలుగా ( ఫిజికల్, కెమికల్, బయోలాజికల్‌) డీగ్రడేషన్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. భూమిని కాలుష్యం నుంచి కాపాడడానికి కొత్త రకాల పద్ధతులను వినియోగించాలన్నారు.  సస్టేనబుల్‌ సాయిల్‌ మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ బేస్డ్‌ ప్రొడక్షన్, వర్టికల్‌ ఫార్మ్స్‌ వంటి కొత్త పద్ధతులతో భూమిని కాపాడుకోవచ్చన్నారు. వీలైనంతవరకు డీగ్రడేషన్, అన్‌సస్టేనబుల్‌ను తగ్గించి రీస్టోర్‌ అండ్‌ రిటర్న్‌ పద్దతులను వాడాలన్నారు. ఒక సెంటిమీటర్‌ భూమిని నిర్మాణం చేయాలంటే 200 నుంచి 400 సంవత్సరాల కాలం పడుతుందని విద్యార్థులకు తెలియజేసారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌ విభాగం డైరక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.