క్రియేటివ్‌ బిజినెస్‌లు చేయాలి

క్రియేటివ్‌ బిజినెస్‌లు చేయాలి
ఎన్‌ఎంఐఎంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ చైర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అభిలాష్‌ పొన్నం

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి వర్క్‌షాప్‌

విద్యార్థులు క్రియేటివ్‌ ఐడియాలు కలిగిన బిజినెస్‌లు చేయాలని ఎన్‌ఎంఐఎంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ చైర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అభిలాష్‌ పొన్నం అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో ‘‘ బిజినెస్‌ రీసెర్చ్‌ మెథడ్స్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఎంఐఎంఎస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ చైర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అభిలాష్‌ పొన్నం మాట్లాడుతూ బిగ్‌ డేటా స్టాటిస్టికల్‌ అనలిటిక్స్‌తో వినియోగదారుల ఏవిధమైన ప్రొడక్ట్స్‌ కొంటున్నారో అంచనా వేయవచ్చునన్నారు. వాటి ఆధారంగా విద్యార్థులు బిజినెస్‌లు ప్రారంభించాలన్నారు. అంతేకాకుండా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా గుర్తించి వాటికి తగిన పరిష్కారాలను గుర్తించాలన్నారు. విద్యార్థులు వీలైనంత ఎక్కువగా బిజినెస్‌ రీసెర్చ్‌ మెథడ్స్‌ను, కాన్సెప్ట్స్‌ను అర్థం చేసుకున్నట్లైతే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం అధ్యాపకులు, సిబ్బంది, రీసెర్చ్‌ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.