అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. హార్వెస్ట్ ఇండియా , కె.ఎస్.కె గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అధినేత వైఎస్ఆర్సిపి రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదిన సందర్భంగా చేబ్రోలు మండలం, గరువుపాలెం గ్రామం నందు గల హార్వెస్ట్ ఇండియా క్యాంపస్ లో   డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదిన సందర్భంగా  ఏర్పాటు చేసిన "మెగా రక్తధాన శిభిరం" ను  గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్  కత్తెర హెని క్రిస్టినా  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ 30 ఏళ్ల నుండి హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా అనేకమంది పేదలు, వృద్ధులు వితంతువులు వికలాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు. తమ సంస్థ ద్వారా కోవిడ్ సమయంలో 40,000 మందిని ఆదుకుందామని వెల్లడించారు ఉన్నవారు పేదవారిని ఆదుకోవాలని సూచించారు.
    అనంతరం జరిగిన వేడుకలలో కత్తెర సురేష్ కుమార్ అభిమానుల ఏర్పాటు చేసిన పెద్ద కేక్ ను కట్ చేసి సురేష్ కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు,అనంతరం చర్చ్ పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
    ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ క్రిస్టినా  రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరితో ప్రత్యేకం గా కలిసి ముచ్చటించారు. ఈ కార్యక్రమము లో సురేష్ కుమార్ గారి కుమారులు కత్తెర డేవిడ్ యశ్వంత్ , వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు శుద్ధపల్లి నాగరాజు , రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్  డాక్టర్ మేడూరి భాస్కరరావు, ఏవో రఘు స్వర్ణ, ముమ్మలనేని భానుమతి,  కొమ్ము బిక్షాలు రాయల్, మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్ సర్పంచులు దూరు రత్నబాబు ధర్మారావు ఇంకా కొండముది బోసు, రవికుమార్ వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు శుద్ధపల్లి నాగరాజు కోట్ల దిలీప్ లను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారు ఘనంగా సత్కరించారు