Skip to main content

ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం

ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం
--అందిపుచ్చుకుంటేనే భవిత
--ఇక మీదట క్షణాల్లోనే కోరుకున్న సమాచారం
--జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో వీసీ ప్రసాద్‌రెడ్డి
విశాఖపట్నం.సెప్టెంబర్‌23: ప్రపంచ వ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో ఆధునిక సాంకేతిక విప్లవం చోటుచేసుకోనుందని, అయితే సకాలంలో దానిని అందిపుచ్చుకుంటేనే భవిత చేకూరుతుందని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌ రెడ్డి అన్నారు. .శుక్రవారం స్థానిక హోటల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఇండియన్ డేటా పోర్టల్  ఏర్పాటు చేసిన జర్నలిస్టుల శిక్షణా తరగతులకు వీసీ  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాాడుతూ నేటి సమాజంలో ప్రతి విషయం ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉందన్నారు.వార్తా సేకరణ, ప్రచురణ, ప్రసారాలు కూడా సాంకేతికంగా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాయన్నారు. ఒకప్పుడు వార్తా పత్రికలు,టెక్స్ట్, తరువాత పిక్చర్స్, దాని తరువాత వీడియోస్ రూపంలోకి కాలానుగుణంగా పరివర్తన చెందాయన్నారు. భవిష్యత్తులో మానవ మస్తిష్కంలోని వూహలను, ఆలోచనలను, అభిప్రాయాలను సైతం సంకేతాలుగా మార్చే  నైపుణ్యం అభివృద్ది చెందుతుందన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ దిశగా అప్పుడే ముందడుగు పడిందన్నారు.ఐదేళ్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని వీటన్నటినీ దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులు కాలంతో పాటు అభివృద్ది చెందుతున్న ఆధునిక సాంకేతికతను వేగంగా అందిపుచ్చు కోవాలన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ దీప్తీ సోని తొలుత వీడియో ప్రజెంటేషన్‌ ద్వారా డేటాను ఏ విధంగా సమకూర్చుకోవచ్చన్నది తెలియజేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుమారు వంద విభాగాలకు సంబంఁధించిన సమాచారం ఇండియా డేటా పోర్టల్‌లో పొందుపర్చడం జరిగిందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పధకాలతో పాటు రూరల్‌ డవలప్‌మెంట్‌, వ్యవసాయం, డ్రాయింగ్‌ స్కీమ్స్‌, మంచినీరుతో పాటు అన్ని వివరాలు గణాంకాలతో సైతం సిద్దంగా ఉంటాయన్నారు. అయితే ఈ సమాచారాన్ని జర్నలిస్టులు స్వీకరించవచ్చున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలో రాష్ట్రాల సమాచారాన్ని పొందుపరుస్తామన్నారు. జర్నలిస్టులు ఆయా సమాచారాన్ని విశ్లేషించుకుని సమగ్రమైన వార్త కధనాలు రూపొందించుకోవచ్చున్నారు. 
--2030 వరకూ పత్రికలకు డోకా లేదు
కొవిడ్‌ అనంతరం పత్రికలు కొంత మేరకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోన్నప్పటికీ 2030 వరకూ పత్రికలకు ఎటువంటి డోకా లేదని ఇండియాన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ పాత్రికేయులు ఎం.సోమశేఖర్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా పత్రికలకు ఆదరణ తగ్గలేదు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ సమగ్ర సమాచారం, యదార్థంతో కూడుకున్న వార్త కధనాలు అందించినంత కాలం పత్రికల మనుగడకు ఇబ్బంది లేదన్నారు. జర్నలిస్టులు సమగ్ర సమాచారం తీసుకుని సమాజానికి అవసరమైన మరిన్ని మంచి కథనాలు అందించాలని కోరారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ  ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డులు తదితర జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై నిత్యం ఒత్తిడి తెస్తూనే ఉన్నామన్నారు. డిసెంబర్ నాటికి  తమ ప్రయత్నాలు ఫలిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  జాతీయ జర్నలిస్టుల సంఘం  కార్యదర్శి  గంట్ల శ్రీనుబాబు, నగర అధ్యక్షులు పోతుమహంతి నారాయణ, బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యవర్గ సభ్యులు జి.శ్రీనివాసరావుతో పాటు, పలు ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. వీరందరినీ ఘనంగా శ్రీనుబాబు సత్కరించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...