కలలకు పట్టాభిషేకం

కలలకు పట్టాభిషేకం

  విజ్ఞాన ఫలాలు సమాజానికి అందించాలి : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య

  వైభవంగా విజ్ఞాన్‌ వర్సిటీ పదో స్నాతకోత్సవం

  ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్టర్‌ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ

  హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ క్రిష్ణ ఎం.ఎల్ల, ఇండియన్‌ బాడ్మింటన్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ నమ్మల్వార్‌ కిడాంబీ, హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎంవీ.రెడ్డి, హైదరాబాద్‌లోని సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎం.ఎం,కీరవాణిలకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం

  1842 మందికి డిగ్రీలు ప్రదానం

  49 మంది విద్యార్థులకు బంగారు పతకాలు

విద్యార్థులు తమ విజ్ఞాన ఫలాలను సమాజానికి అందించాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య విద్యార్థులకు ఉద్బోధించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పదో స్నాతకోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రముఖ మల్టీ నేషనల్‌ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకోవటంతో పాటు జీవితంలో బాగా స్థిరపడే ప్రక్రియలో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులందరూ భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలన్నారు. భవిష్యత్‌ అవసరాలు, టెక్నాలజీలను మిళితం చేసుకుంటూ మీరు ఎంచుకున్న రంగాలలో విజయవంతమైన నాయకులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.  21వ శతాబ్ధంలో ప్రపంచ దేశాలన్నింటిలోకి భారతదేశం ముందంజలో ఉంటుందని తెలిపారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా పనిచేస్తూ భారతీయ మేథో పరాక్రమాన్ని తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో ఉపాధ్యక్ష పదివిని కూడా పొందారని గుర్తుచేశారు. విద్యార్థులు ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు అందులో సామాజిక స్పృహ కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో బంధాలకు, అనుబంధాలకు, స్నేహితులు, అధ్యాపకులకు సమయాన్ని కేటాయించాలన్నారు.

రాబోయే తరాలకు మీరే ప్రతీక : విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు

నేడు స్నాతకోత్సవం సందర్భంగా పట్టాలు అందుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాబోయే తరాలకు ప్రతీకగా నిలవాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. విద్యార్థులందరూ సమాజంలో పెరిగిన పోటీతత్వాన్ని తట్టుకుని పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. క్షణికమైన సంతోషాల వైపు వెళ్లకుండా జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలవైపు దృష్టిసారించాలన్నారు. విద్యార్థులందరూ వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్‌ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలని తెలియజేసారు.

నలుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు

స్నాతకోత్సవం సందర్భంగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ నలుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేసింది.  హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ క్రిష్ణ ఎం.ఎల్ల, ఇండియన్‌ బాడ్మింటన్‌ ప్లేయర్‌ శ్రీకాంత్‌ నమ్మల్వార్‌ కిడాంబీ, హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎంవీ.రెడ్డి, హైదరాబాద్‌లోని సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎం.ఎం,కీరవాణిలకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేసింది.


1842 మందికి డిగ్రీలు : వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ 10వ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 1842 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసారు.  వీటితోపాటు 49 ( అకడమిక్‌ గోల్డ్‌ మెడల్స్‌–20, బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌ అవార్డులు–21, చైర్మన్స్‌ గోల్డ్‌ మెడల్‌–1, ఎండోమెంట్‌ అవార్డులు–3, బెస్ట్‌ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, సోషల్‌ ఎంగేజ్‌మెంట్‌–1, బెస్ట్‌ లీడర్‌ అవార్డు–1, ఎగ్జెంప్లరీ అవార్డు–1, సోషల్‌ ఎంగేజ్‌మెంట్‌ కేటగిరీ–1) మందికి బంగారు పతకాలను విద్యార్థులకు అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగాలంటే సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించాలని తెలిపారు. నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. ఇప్పటి నుంచి విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.

బంగారు పతకాల విజేతలు వీరే..
స్నాతకోత్సవం సందర్భంగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఆయా విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసింది.

ప్రతిష్టాత్మక చైర్మన్స్‌ గోల్డ్‌ మెడల్‌ కేశవ్‌ కుమార్‌ రాయ్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌)
ఎండోమెంట్‌ అవార్డులు (3) :
రావి ప్రహర్షిత (సీఎస్‌ఈ), మద్దినేని అభిజిత్‌ సాయి (బయో ఇన్ఫర్మాటిక్స్‌), ఏలూరి మనోశ్రావ్య(ఈసీఈ),
బెస్ట్‌ లీడర్‌గా కందుల సుందర్‌ (సీఎస్‌ఈ), 
బెస్ట్‌ సోషియల్‌ ఎంగేజ్‌మెంట్‌ అవార్డు షేక్‌ సాధిక్‌ ( ఫుడ్‌ టెక్నాలజీ), 
ఎగ్జెంప్లరరీ స్టూడెంట్‌ అవార్డు అబ్దుల్‌ ముజీర్‌ ( సీఎస్‌ఈ),
 బ్రేవరీ కేటగిరీ బెస్ట్‌ ఎన్‌సీసీ– ఎన్‌ఎస్‌ఎస్‌అవార్డు పీఎన్‌వీఎస్‌ఎస్‌ నుపుర్‌ క్రిష్ణకు దక్కాయి.

 బెస్ట్‌ అవుట్‌గోయింగ్‌ స్టూడెంట్స్‌ అవార్డులలో 
బయెటెక్నాలజీ విభాగం నుంచి జీ.కావ్య,
 కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి షేక్‌ అబ్దుస్‌ సమద్,
సివిల్‌ నుంచి ఎస్‌.లీలా మహేశ్వరి,
 సీఎస్‌ఈ విభాగం రావి ప్రహర్షిత, 
ఈసీఈ నుంచి ఎం.భరత్, 
ఈఈఈ విభాగం నుంచి ఆవుల మణికంఠ రెడ్డి, 
ఐటీ నుంచి కే. క్రిష్ణ కార్తికేయ శర్మ ,
 మెకానికల్‌ విభాగం నుంచి అంకిత్‌ కుమార్,
 ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ నుంచి ఐ.ఆనంద్‌బాబు,
 టెక్స్‌టైల్‌ నుంచి డీ.ధర్మేంద్ర రెడ్డి,
 అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ నుంచి కేశవ్‌ కుమార్‌ రాయ్,
 బయోఇన్ఫర్మాటిక్స్‌ విభాగం నుంచి మద్దినేని అభిజిత్‌ సాయి,
 ఫుడ్‌ టెక్నాలజీ నుంచి జొన్నల భ్రమరాంబిక,
 బీఎంఈ నుంచి ఆనంద వర్ష కంచర్ల,
 ఫార్మసీ నుంచి కే.ఉదయ రత్న,
 బీసీఏ నుంచి టీవీవీఎస్‌ శ్రీవైష్ణవి,
 బీబీఏ నుంచి మిన్నకూరి ఉమా సాయి కిరణ్,
 బీఎస్సీ నుంచి వజ్జ రఘు హర్ష, 
ఎంబీఏ నుంచి కే.వెంకటేశ్వర రెడ్డి ,
ఎంసీఏ నుంచి షేక్‌ అబ్జల్,
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ నుంచి గడ్డం గౌతమి తదితరులు బంగారు పతకాలు సాధించారు. 

అంబరాన్నింటిన సంబరం
డిగ్రీలు చేతబట్టుకున్న వేళ విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. కేరింతలతో వర్సిటీ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. నాలుగేళ్ల తమ అనుభవాలను విద్యార్థులు ఒకరికొకరు పంచుకున్నారు. తరగతి గదుల్లో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నారు. విశ్వవిద్యాలయంతో తాము పెంచుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సరదగా గడిపిన గడియలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ సంతోషంగా గడిపారు. గుర్తుగా సెల్ఫీలు దిగారు. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన బూనారు. విద్యార్థులంతా తలపాగా, కండువా వేసుకుని అచ్చతెలుగు పెద్ద మనుషుల్లా కనిపించారు. సంస్కృతీ సంప్రయాదాలు ప్రతిబింబిస్తూనే సాంకేతిక విద్యా సర్టిఫికెట్లను పొందారు.

కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, స్నాతకోత్సవం ప్రధాన కన్వీనర్‌ డీ.విజయక్రిష్ణ, బోర్డు ఆఫ్‌ మేనేజిమెంట్‌ సభ్యులు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.