కొత్త ఊహలు

*కొత్త ఊహలు.....
బాధగా ఉన్న 
మనసుకు ఓదార్పు 
కొమ్మా ఉయ్యాల 
కోనా జంపాల
తుళ్ళిపడే ఊరడింపు....

ఆకాశంలో ఉండే 
నక్షత్రాలతో చెలిమి 
ఊహకే కొత్త భాష్యం 
మదికే వెన్నెల 
మొలక వేసేను......

కొండా కోనలతో 
స్నేహం అల్లుకొని 
మమతల జల్లుల 
పాటల పల్లకిలో 
అలా అలా తేలిపోతేనో.....

చిగురులు తొడిగిన 
రెమ్మల కొమ్మకు
చిలకవన్నె రంగుల 
మొలకను నేనైతే 
మరీ బాగుండునేమో......

తూనీగ అల్లరిగా 
తిరగాడు పొదలలో 
పచ్చని తివాచి పరిచి 
స్వాగతాన్ని పలికి 
సంబరాలు జరపాలనుంది.......

________
శ్రీనివాస్ కట్ల 
కరీంనగర్.