విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఫిజికల్‌ డైరక్టర్‌కు పీహెచ్‌డీ

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫిజికల్‌ డైరక్టర్‌ చేబోయన సురేష్‌కు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం సోమవారం తెలిపింది. ‘‘ఎఫికసీ ఆఫ్‌ సబ్‌–మాక్సిమల్‌ రెసిస్టన్స్‌ ట్రైనింగ్‌ డెట్రైనింగ్‌ అండ్‌ రీట్రైనింగ్‌ ఇంపాక్ట్‌ ఆన్‌ సెలెక్టెడ్‌ బాడి కంపోసిసన్‌ సైకోలాజికల్‌ అండ్‌ స్ట్రెంగ్త్‌ పారామీటర్స్‌ ఆఫ్‌ ఇంటర్‌–కాలిజియట్‌ అథ్లెట్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేసింది. ఈయనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ ఐ.దేవి వర ప్రసాద్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొంది. ఈయన పరిశోధన చేసిన ట్రైనింగ్‌ మెథడ్స్‌ ద్వారా  స్పోర్ట్స్‌ ప్లేయర్స్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసింది. పీహెచ్‌డీ పట్టాపొందిన చేబోయన సురేష్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.