ప్రాథమిక పరిశోధనలు చేయాలి నోబెల్ గ్రహీత డాక్టర్ సర్ రిచర్డ్ జే.రాబర్ట్స్ నాయకత్వ లక్షణాలు పెరగాలి : బెంగళూరులోని ఐఐఎస్‌సీ మాజీ డైరక్టర్, బైరాక్ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ జీ.పద్మనాభన్ విద్యార్థుల్లో ఉత్సుకత పెరగాలి : యూఎస్‌ఏ–కొలంబస్‌లోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీ.పీ.ఎస్.వర్మ విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థులు ప్రాథమిక పరిశోధనలను విస్తృతం చేయాలని నోబెల్ గ్రహీత సర్ రిచర్డ్ జే.రాబర్ట్స్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్ విభాగాల ఆధ్వరంలో ‘‘ ఫ్రాంటీర్స్ ఇన్ న్యూట్రిషన్, మెడికల్ జీనోమిక్స్ అండ్ డ్రగ్ డిస్కవరీ (ఇన్‌బిక్స్–22)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా వర్చువల్ విధానంల...