Skip to main content

అంబేద్కర్ స్త్రీ విముక్తి పోరాటం

అంబేద్కర్ స్త్రీ విముక్తి పోరాటం 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భారత రాజ్యాంగ నిర్మాత సముచితమైన రాజ్యాంగాన్ని అందించిన దార్శనికుడు ఈ దేశంలోని స్త్రీలకు కూడా కొన్ని హక్కులు అవసరము అనుకున్నాడు. ఉమ్మడి కుటుంబములో స్త్రీల యొక్క ఆస్తి హక్కులను గురించి.  వ్యక్తి వికాశానికి దోహదపడుతుందని ఆయన తలంచాడు. సెలెక్ట్ కమిటీ దగ్గర ఉన్న హిందూకోడ్ బిల్లును బయటకు తెప్పించాడు. 1941లో భారత ప్రభుత్వం హిందూ న్యాయశాస్త్రానికి సవరణలు చేయటానికి బి.యన్.రావు ఆధ్వర్యంలో కమిటి వేసింది. చాలాకాలంగా అది మరుగున పడింది. న్యాయశాఖామంత్రిగా న్యాయశాస్త్ర కోవిదునిగా ఈ బిల్లును పరిశీలించారు అంబేద్కర్. బిల్లు సమగ్రంగా లేదని, దేశంలో చాందస వర్గాలన్నీ ఎదురు తిరిగాయి. అఖిల భారత వర్ణాశ్రమ "స్వరాజ్య సంఘం” వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి ప్రతిఘనలు పెరిగిపోయాయి. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తరువాత సెలెక్ట్ కమిటీకి పంపారు. అంబేద్కర్ దీన్ని గురించి చాలాచోట్ల వివరణ ఇవ్వటం జరిగింది. ప్రజలకు అవగాహన కోసం అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు. స్త్రీ తన సంపదనూ, హక్కులను, రక్షించుకో గలిగినప్పుడే స్వేచ్ఛను పొందగలుగుతుంది. హిందూకోడ్ బిల్లు స్త్రీలకు ఆ శక్తిని నమ్మకాన్ని ఇస్తుందని చెప్పారు. చాందస వాదులు ఈ బిల్లును తిరస్కరించడాన్ని ఆయన ఖండించాడు. స్త్రీలకు సామాజిక చైతన్యం దిశగా ఈ బిల్లు ఉందని భావించారు.ఈ బిల్లులో ముఖ్యంగా కొన్ని అంశాలు  మగపిల్లలతోపాటు ఆడపిలలకు కూడా సమ ఆస్తి హక్క, పిల్లలను దత్తతు తీసికొనే హక్కు ఇచ్చే హక్కు,  వివాహ విషయంలో కులాంతర వివాహాలకు అవకాశం ఇవ్వడం , బహు బార్యలు రద్దు, దత్తత, ఏకులం నుంచైనా తీసికొనడం, దత్తత తీసుకొంటె ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారి తల్లికి ఆస్తిలో బాగం ఉండటం. బిల్లు అన్ని వర్గాల జాతుల ప్రజలకు ఎంతో ఊరట కలిగించింది. స్త్రీలను బలోపేతం చేసే బిల్లు. అగ్రవర్గాల స్త్రీలకు ఇంకా ఎక్కువ మేలు. అయితే భారతదేశ ప్రజలకు చాందస వాదులకు నచ్చలేదు.ఎందుకంటే గతంలో ఉన్నట్లుగా, అన్నదమ్ములు పంచుకొనే ఆస్తి, ఆడ పిల్లలకు కూడ ఇవ్వటాన్ని వాళ్ళు అంగీకరించలేదు. స్త్రీని ఎంతోకొంత కట్నంగా ఇచ్చి వదిలించుకొనే రోజులు అవి. అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశ పెట్టేటప్పుడు జరిగిన వాదోపవాదాలలో అంబేద్కర్ ఎన్నో అవమానాలకు గురి అయ్యాడు. 'హిందూ' అనే పదం మీదనే చాలా సుదీర్ఘ చర్చనీయాంశం అయ్యింది. అనువాదాల ప్రాబల్యం పెరిగిపోయింది. వారు పరిహాసాలను చూసి అంబేద్కర్ అవమాన పడటంతో పాటు బాధపడేవాడు, వీరు సూచించిన సవరణ బిల్లును గందరగోళపరుస్తున్నాయని అంబేద్కర్ వేధన చెందేవాడు. ఆచారాలు, వ్యవహారాలు గురించి ఎక్కువ చర్చించేవారు. సభలో ఫిరోజ్ గాంధీ, జగజ్జీవనరావు, దుర్గాబాయి దేశముఖ్, లక్ష్మణన్, పండిట్ కుంజాల, దేవిసింగ్, గాద్గిల్, చౌదరి ప్రభుతులు బిల్లును సమర్ధించారు. పండిట్ మైత్ర, ప్రొ॥ యశ్వంత్రాయ్, పండిట్ బార్గల్, పన్నాలాల్ బన్సీలాల్ ప్రభుతులు వ్యతిరేకిస్తూ అడ్డుపడ్డారు.
ఆనాటి స్త్రీలు, సనాతన ధర్మాలతో వంటింటి కుందేలు లాగ బయట ప్రపంచం తెలియక సూర్యుని కూడా చూడక, రోగాలనపడి ఎంతో మంది చనిపోయే వారిని అనేక మంది పెద్దలు చెప్పారు. ఈ విషయాన్ని అంగీకరించారు పెద్దలు. మూడురోజులు వాద ప్రతి వాదాలు జరిగిన తరువాత 1951 సెప్టెంబర్ సమావేశాలకు ఈ బిల్లును వాయిదా వేసారు. ఈ సమావేశంలో కొన్ని సవరణలు చేసి అప్పటికే అంబేద్కర్ ఆరోగ్యం సరిలేక, కాలయాపన చేయకుండా త్వరగా ముగించాలని ప్రయత్నం చేయగా, దాన్ని పొడిగించాలని చాలా మార్పులు చేయాలని ఆందోళన చేయటం జరిగింది. ఆపరిస్థితిలో నెహ్రూ దాన్ని కుదించి రెండు భాగాలుగా చేసి వివాహం - - విడాకులు చేద్దామన్నారు. దానికి అంబేద్కర్ అంగీకరించాడు. హిందూ సమాజానికి ఇది ఒక ఊరట కలిగించింది. ఎందుకంటే హిందూకోడ్ బిల్లు ఉపసంహరించుకొన్నారు కాబట్టి బిల్లు గూర్చి నాలుగు గంటలపాటు విసుకుచెంది సెప్టెంబర్ 25న ఆమోదించారు. ఈ బిల్లును జ్యోతిర్మఠం శంఖరాచార్యులు వ్యతిరేకించగా వేదపండితుడు, పండిట్ దర్మదేవ్ సమర్థించారు. రాజేంద్రప్రసాద్, పఠేల్ వంటివారు అసెంబ్లీలో వ్యతిరేకాలు కాంగ్రెస్ వైఖరికి విరక్తి కలిగి అంబేద్కర్ సెప్టెంబర్ 27న న్యాయశాఖ నూతన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూకోడ్ బిల్లు విషయాలలో ఆయన్ని ఎంతో అవమానపరచారు. రెండో సమావేశములో అంబేడ్కర్ మాట్లాడటానికి అవకాశం ఇవ్వనందున రాజీనామా పత్రాన్ని అసెంబ్లీలో విసిరి కోపంగా బయటకు వెళ్ళిపోయారు అంబేద్కర్. పితృస్వామ్య సమాజం స్త్రీలకు హక్కులు అనే భావననే భరించ లేకపోయింది. ఇంటిలో ఉన్న స్త్రీని సమానంగా చూడటం అనేది పితృస్వామ్య సమాజం అంగీకరించలేకపోయింది. 
హిందూకోడ్ బిల్లు పట్ల అప్పటి స్త్రీ నాయకురాలు తగినంత శ్రద్ధ కనుపరచలేదని, స్త్రీ సమాజంలో ఉన్నత స్థానం గురించి వారు దూరదృష్టితో ఆలోచించలేకపోయారని అంబేద్కర్ వేదన పడ్డాడు. 
ఆ బిల్లు పట్ల ఆయన పట్టుదలతో అనేక రచనలు, గ్రంధాలు, ప్రసంగాల ద్వారా, వివరాలు తెలియపరచారు. హిందూకోడ్ బిల్లు ద్వారా అంబేద్కర్ సాదించాలకున్ను చాలా హక్కులు తదుపరికాలంలో స్త్రీలకు అవి లభించాయి. ఆయన స్ఫూర్తినే అందుకు కారణం.  స్త్రీ హక్కుల కోసం ఎన్నో అవమానాలు భరించి, స్త్రీ, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం శ్రమించిన శ్రమ జీవి అంబేద్కర్.  సమాజంలో సనాతన ధర్మాలను ఎదుర్కొంటూ, అణగద్రొక్క బడిన జాతికోసం పోరాటం చేసిన యోదుడు ఆయన. ముఖ్యంగా స్త్రీకి సముచిత స్థానం కోసం అసెంబ్లీలో అవమానపడిన అంబేద్కర్ కు జోహార్లు.
వ్యాసరచన : 
డా॥ కనపర్తి అబ్రహాంలింకన్ కన్వినర్, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ లుంబినీవనం , పొన్నూరు.
సెల్:8309695511

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...