దేశానికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కావాలి

దేశానికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కావాలి

  సైమ్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఎండీ శ్రీనివాస్‌ చమర్తి

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇగ్నిషన్‌–2కే22

ప్రస్తుతం దేశానికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కావాలని సైమ్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఎండీ శ్రీనివాస్‌ చమర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో శనివారం ఎంట్రపెన్యూర్‌ సెల్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్నోవేషన్‌ డే, భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని ‘‘ఇగ్నిషన్‌–2కే22’’ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెమ్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఎండీ శ్రీనివాస్‌ చమర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలంటే రీజనింగ్, అనాలసిస్, థింకింగ్, ఎవాల్యూషన్, రేషనల్‌ డెసిషన్‌ మేకింగ్‌ వంటి లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు నిరంతరం తెలుసుకోవడం, ప్రయోగాలు చేయడం, లాజికల్‌ థింకింగ్‌ వంటివి చేయడం వలన లెర్నింగ్‌ పెరుగుతుందన్నారు. విద్యార్థులు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సోషల్‌ గ్రోత్, ఇంటెలెక్చువల్‌ గ్రోత్, ఎకనామిక్‌ గ్రోత్‌లో ముందంజలో ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యార్థులు వారి వద్ద ఉన్న ఇన్వెన్షన్, ఇన్నోవేషన్‌ ఐడియాలను అమలుపరిస్తేనే అభివృద్ధి చెందగలమన్నారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఎంటర్‌ప్రెన్యూర్‌ సెల్‌ డైరక్టర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.