విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంచార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ పీఎంవీ రావు మాట్లాడుతూ విద్యార్థులందరూ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను భవిష్యత్‌ తరాలకు అందజేయాల్సిన బాధ్యతను తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందుకు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర అవసరమని తెలిపారు. ఆరోగ్యంగా ఉండి, శ్రద్ధగా చదువుకునే విద్యార్థులు జీవితంలో ఏ అవకాశాన్నయినా అందిపుచ్చుకోగలరని, ఉన్నత శిఖరాలను చేరుకోగలరని వివరించారు. ప్రధానంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వారి వారి రంగాల్లో చోటు చేసుకుంటున్న నూతన ఆవిష్కరణలపై పట్టుసాధించగలిగిన ప్రతి విద్యార్థి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారని తెలిపారు. అనంతరం ప్రపంచ ఆహార దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు ఫుడో గ్రఫీ, సార్ట్‌ ద కార్ట్, ఈటింగ్‌ రేస్, డిజైన్‌ డిజిటల్‌ పోస్టర్, సెంజోరీ, జామ్‌ ( జస్ట్‌ ఏ మినిట్‌), బ్లైండ్‌ ఫుడ్‌ ప్రో మాక్స్, క్విజ్, డిబేట్, ఈట్‌ ఇట్‌ ఆర్‌ స్ట్రేవ్, ట్రెజర్‌ లాండ్‌ వంటి పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.