మద్య రహిత సమాజ స్థాపనే గాంధీజీకి ఘనమైన నివాళి


మద్య రహిత సమాజ స్థాపనే గాంధీజీకి ఘనమైన నివాళి.
   - వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.
దేశవ్యాప్తంగా మద్య రహిత సమాజ స్థాపనే మహాత్మా గాంధీజీకి ఘనమైన నివాళి అని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల రెండవ తేదీ గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ హాల్ లో మద్య వ్యతిరేక ఉద్యమంలో గాంధీజీ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథిగా శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మత్తు పానీయాలకు వ్యతిరేకంగా భారత జాతిని మేల్కొరిపినారని
పేర్కొన్నారు. హరిజన,యంగ్ ఇండియా పత్రికలలో మద్యానికి వ్యతిరేకంగా పలు వ్యాసాలు రాశారన్నారు.తిని, త్రాగి,తిరిగేందుకా మనిషి బ్రతికేదని మహాత్మా గాంధీ ప్రశ్నించారన్నారు. ఒక గంటసేపు నన్ను భారతదేశానికి నియంతగా నియమిస్తే మద్యం దుకాణాలన్నింటినీ మూసివేస్తానని ఒక సందర్భంలో గాంధీజీ పేర్కొన్నారని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుర్తు చేశారు.ఎక్సైజ్ ఆదాయం పాపమయమని,అన్ని నేరాలకు ఇందనం మద్యమేనని పేర్కొంటూ గాంధీజీ భారతీయులను చైతన్యవంతులను చేసినారని లక్ష్మణరెడ్డి తెలిపారు.మద్య నియంత్రణపై జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని,జాతీయ ఎక్సైజ్ పాలసీని రూపొందించాలని,మద్య నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని లక్ష్మణరెడ్డి కోరారు. శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ ప్రపంచానికి అహింసా,సత్య బోధన,సత్యాగ్రహం, సహాయ నిరాకరణ లాంటి బలమైన ఉద్యమ ఆయుధాలను అందించిన మహా మనిషీ గాంధీజీ అని కొనియాడారు.మత సహనాన్ని, గ్రామ స్వరాజ్ ను,అభివృద్ధి వికేంద్రీకరణను బోధించిన తత్వవేత్త గాంధీజీ అని తెలిపారు.  ఐన్ స్టీన్,మార్టిన్ లూథర్ కింగ్, రవీంద్ర నాధ్ ఠాగూర్,నెల్సన్ మండేలా లాంటి వారిని ప్రభావితులను చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు.రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ప్రసంగిస్తూ
స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా గ్రంథాలయ ఉద్యమాన్ని గాంధీజీ ప్రోత్సహించినారన్నారు.స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస పద్ధతిలో
అంతమొందించిన మహానేత గాంధీజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు,గాంధీ స్మారక సమితి వ్యవస్థాపకులు ఈదర గోపీచంద్,దీక్షిత్ ఫౌండేషన్ కృష్ణ, ప్రొ"మస్తాన్,డా"వి.శింగారావు, ప్రముఖ హేతువాది చంద్రశేఖర్, బండి సాహితి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండి అశోక్ రెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి,డా"యశస్వి రమణ,స్కౌట్స్ అండ్ గైడ్స్ కన్వీనర్ శ్రీనివాసులు,సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు లతో పాటు గాంధీజీ అభిమానులు,వివిధ ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కార్యక్రమ ప్రారంభంలో
మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.